Paytm Share: ఇప్పటికీ చాలా మంది ఇన్వెస్టర్ల కళ్ల ముందర పేటీఎం షేర్లను కొన్న రోజులు మెదులుతూనే ఉంటాయి. వారు కొన్న తర్వాత ఫిన్ టెక్ షేర్లు కుప్పకూలటాన్ని ఇప్పటికీ మర్చిపోరు.
అయితే గత కొన్ని త్రైమాసికాలుగా పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. పేమెంట్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన కంపెనీ వడివడిగా తన ప్రయాణాన్ని లాభాల వైపుకు తీసుకెళుతోంది. ఇన్వెస్టర్లు సైతం వ్యాపార పనితీరును, కంపెనీ భవిష్యత్తు కార్యాచరణలను నిశితంగా పరిశీలిస్తూ షేర్లపై పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. దీంతో తాజాగా పేటీఎం స్టాక్ 52 వారాల గరిష్ఠాన్ని తాకి రికార్డులు సృష్టిస్తోంది.

ఈరోజు స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్లు తమ ర్యాలీని కొనసాగించాయి. ఈ క్రమంలో 2.89 శాతం మేర పెరిగి గరిష్ఠమైన రూ.977 స్థాయికి చేరుకున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ బీఎస్ఈలో రూ.61,476 కోట్లకు చేరుకుంది. 2023లో కంపెనీ షేర్లు 82.26 శాతం లాభపడ్డాయి. గతాన్ని పరిశీలిస్తే సెప్టెంబర్ 24, 2022లో కంపెనీ స్టాక్ ధర 52 వారాల కనిష్ఠమైన రూ.439.60 వద్ద ఉన్నాయి. టెక్నికల్స్ సైతం కంపెనీకి సానుకూల ధోరణిని సూచిస్తున్నాయి.
సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో కంట్రిబ్యూషన్ మార్జిన్ & ఆపరేటింగ్ లెవరేజీ మెరుగుపడటం వల్ల Paytm నిర్వహణ లాభదాయకత పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఆరోగ్యకరమైన వృద్ధిని నివేదించే అవకాశం ఉందని పేర్కొంది. కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.1,000గా ప్రకటిస్తూ బ్రోకరేజ్ BUY రేటింగ్ అందించింది. దీనిని క్యూ2 తర్వాత మళ్లీ సమీక్షించనుంది. ఇతర ఆర్థిక సంస్థలు సైతం కంపెనీ ఆదాయాలపై సానుకూలంగా ఉన్నాయి. ఇదే సమయంలో జియో ఫైనాన్షియల్స్ పోటీదారుగా కంపెనీ ముందు నిలుస్తోంది. YES సెక్యూరిటీస్ స్టాక్‌కు 'యాడ్' రేటింగ్‌ను ఇస్తూ రూ.1,025ని టార్గెట్ ధరగా నిర్ణయించింది.


Click it and Unblock the Notifications