Upper Circuit: శుభవార్తతో అప్పర్ సర్క్యూట్ తాకిన స్టాక్.. పేలుడు పెరుగుదల అందుకే..
Paytm Shares: బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్బీఐ ఇటీవల తీసుకున్న కఠిన నిర్ణయాలు పేటీఎం కంపెనీని ఒక్కసారిగా పాతాళానికి పడిపోయేలా చేశాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
అయితే నేడు పేటీఎం కంపెనీ షేర్లు తిరిగి పుంజుకున్నాయి. దాదాపు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకటంతో ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నెలకొంది. పేలవ ప్రదర్శన నుంచి పేలుడు పెరుగుదలకు ఒక వార్త కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి యూపీఐ చెల్లింపుల కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్‌గా వ్యవహరించడానికి అనుమతించమని పేటీఎం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని అభ్యర్థించిన సంగతి తెలిసిందే.

ఈ విషయంలో Paytm అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని NPCIకి సూచించినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.నిబంధనల ప్రకారం Paytm UPI కోసం థర్డ్ పార్టీ యాప్‌గా పని చేయవచ్చో లేదో పరిశీలించాలని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. పేటీఎం పేమెంట్స్ యూపీఐ చెల్లింపుల కోసం Paytm NPCI నుంచి అనుమతి పొందినట్లయితే.. అది వారికి గొప్ప ఉపశమనాన్నిచ్చే వార్త అవుతుంది. అయితే దీనికోసం వారు కొత్త బ్యాంక్‌ను గుర్తించాల్సి ఉంటుంది.
పెద్ద మెుత్తంలో యూపీఐ చెల్లింపులు నిర్వహించేందుకు వీలుగా ఉన్న 4-5 బ్యాంకుల వివరాలను పేటీఎం ఎన్పీసీఐకి అందించాలని రిజర్వు బ్యాంక్ శుక్రవారం వెల్లడించింది. ఈ వ్యవహారంలో పేటీఎం.. NPCI నిర్ణయం కోసం వేచి ఉంది. ఇది Paytmకి అనుకూలంగా వస్తుందో లేదో చూడాలి. అయితే మెుత్తానికి వార్త సానుకూలమైనది కావటంతో నేడు షేర్లు 5 శాతం లాభంతో రూ.428.10 వద్ద మార్కెట్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications