Paytm Shares: భారీగా పెరిగిన పేటీఎం షేర్ ధర.. రిజర్వు బ్యాంక్ ఒప్పుకోవటంతో..
Paytm Shares: వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి పేటీఎం షేర్లు వరుసగా లాభపడుతున్నాయి. ఫిన్ టెక్ కంపెనీ ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారెంటీ (FLDG) ప్రోగ్రామ్‌ను రిజర్వు బ్యాంక్ ఆమోదించటంతో ఇన్వెస్టర్ల దృష్టి కంపెనీ షేర్లపై పడింది.
ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారెంటీ అనేది దేశంలోని ఫిన్‌టెక్‌లు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో(NBFCలు) భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగించే ఒక ప్రసిద్ధ ఉత్పత్తి. దీని ద్వారా సదరు సంస్థలకు సంభవించే నష్టాలు కవర్ చేయబడతాయి. లోన్ తీసుకున్న కస్టమర్లు డిఫాల్ట్ అయిన సందర్భంలో సంభవించే నష్టాలను తిరిగి పొందటానికి ఇది సహాయపడుతుంది.

రిజర్వు బ్యాంక్ ఆమోదం గురించి వార్తలు వెలువడగానే పేటీఎం షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోలుకు క్యూ కట్టడంతో వరుసగా మూడు రోజుల్లో షేర్ ఏకంగా 12 శాతానికి పైగా లాభపడింది. ఈ క్రమంలో శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో షేర్ ధర రూ.813.75 వద్ద ఉంది. ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో షేర్ 5.41 శాతం మేర లాభపడింది. షేర్ ధర మూడు రోజుల కిందట రూ.709 వద్ద ఉంది.
RBI మోడల్‌ను ఆమోదించింది, మొత్తం రుణ విలువలో 5 శాతం మొత్తాన్ని పరిమితం చేసింది. దీంతో పేటీఎం షేర్లు రివ్వున ఎగబాకగా.. ప్రస్తుతం స్టాక్ ధర 9 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. కంపెనీ పనితీరు గత కొన్ని త్రైమాసికాలుగా పెరుగుపడుతున్న తరుణంలో బ్రోకరేజ్ సంస్థలు సైతం కంపెనీ షేర్లపై బులిష్ వ్యూ వ్యక్తం చేస్తున్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ తన నష్టాలను గణనీయంగా తగ్గించుకోగలిగింది. అలాగే ఆదాయం సైతం 52 శాతం మేర పెరిగింది.
బ్యాంక్ ఆఫ్ అమెరికా పేటీఎం షేర్లకు కొనుగోలు రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను రూ.855గా నిర్ణయించింది. కంపెనీకి బలమైన రాబడి ఊపందుకునే అంచనాలను అప్‌గ్రేడ్ చేయడానికి కారణమని పేర్కొంది


Click it and Unblock the Notifications