Paytm Share: దేశంలోని అన్ని ఫిన్ టెక్ కంపెనీల కంటే ఎల్లప్పుడూ పేటీఎం ఒక అడుగు ముందుగానే ఉంటుంది. అది టెక్నాలజీ అయినా లేక కొత్త సేవలను పరిచయం చేయటంలోనైనా. కంపెనీ ఇటీవల లాభాల్లోకి రావటానికి అతి చేరువలో ఉంది.
ప్రస్తుతం పేటీఎం సంస్థలో ఫౌండర్ విజయ శేఖర శర్మ తన వాటాను క్రమంగా పెంచుకుంటున్నారు. ఈరోజు మార్కెట్లో పెద్ద బ్లాక్ డీల్స్ నమోదు కావటంతో స్టాక్ 1 శాతానికి పైగా లాభపడింది. ఈ క్రమంలో 22.70 మిలియన్ షేర్లు చేతులు మారాయి. ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎమ్‌లో 2.3 కోట్ల షేర్లకు సమానమైన 3.6 శాతం వాటాను చైనీస్ ఫిన్‌టెక్ దిగ్గజం యాంట్‌ఫిన్ విక్రయించే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ ఆగస్టు 25న ముందుగా నివేదించింది.

ఉదయం 9.40 గంటల సమయంలో పేటీఎం షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ.914.95 వద్ద లాభాల్లో కొనసాగుతోంది. 2023లో ఇప్పటి వరకు పేటీఎం కంపెనీ షేర్లు దాదాపు 70 శాతానికి పైగా లాభపడ్డాయి. అలాగే స్టాక్ దాని కనిష్ఠ స్థాయి నుంచి దాదాపు 100 శాతం ఎక్కువ పెరిగింది. కంపెనీ స్థిరమైన రాబడి పెరుగుదల, ఇటీవలి త్రైమాసికాల్లో నష్టాలను తగ్గించడం సానుకూల అంశాలుగా నిలుస్తున్నాయి. FY25 మధ్య నాటికి కంపెనీ ఆపరేటింగ్ బ్రేక్‌ఈవెన్‌ను సాధించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆగష్టు 25న గ్లోబల్ రీసెర్చ్, బ్రోకింగ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ Paytm షేర్లకు "అవుట్ పెర్ఫార్మ్" రేటింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లకు రూ.1,100 టార్గెట్ ధరగా నిర్ణయించింది. బ్లూమ్ బెర్గ్ ప్రకారం మెుత్తం 12 బ్రోకరేజ్ కంపెనీలు పేటీఎం షేర్లకు BUY రేటింగ్ ఇవ్వగా.. రెండు కంపెనీలు మాత్రం హోల్డ్ రేటింగ్ అందించాయని వెల్లడైంది. Paytmలో విజయ్ శేఖర్ శర్మ యాజమాన్యం 19.42 శాతానికి పెరగటం కూడా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతోంది.


Click it and Unblock the Notifications