పేటీఎం షేర్లు పాతాలానికి పడిపోతున్నాయి. లోయర్ సర్క్యూట్లు తాకుతున్నాయి. ఫిబ్రవరి 16న పేటీఎం షేర్లు ఉదయం 9 గంటల 2 నిమిషాలకు దాదాపు 2 శాతం పడిపోయి. ఎన్‌ఎస్‌ఈలో తాజా రికార్డు కనిష్ట స్థాయి రూ.318.05ను తాకాయి. పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్(PPBL)ని ఏ కస్టమర్ ఖాతాలోనైనా డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను స్వీకరించకుండా ఇటీవల RBI నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీనియర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను ప్రశ్నించి వారి నుంచి పత్రాలను కూడా తీసుకుంది. దీంతో పేటీఎం షేర్లలో ఒత్తిడి కనిపించింది. గురువారం సెషన్ లో ఫిన్‌టెక్ షేర్లు 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో పేటీఎం షేర్లు 23 శాతం పడిపోయాయి. దీంతో పేటీఎంలో పెట్టుబడి పెట్టినవారు తీవ్రంగా నష్టపోతున్నారు.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షాల కారణంగా గత 11 ట్రేడింగ్ రోజులలో పేటీఎం సుమారు రూ. 27,000 కోట్లు లేదా దాని విలువలో 57 శాతం కోల్పోయింది. పేటీఎం కస్టమర్ల కేవైసీలో పెద్ద అవకతవకలను గుర్తించింది. ఆ తర్వాత చర్యలు కూడా ప్రారంభించింది. ఇది కస్టమర్‌లు, డిపాజిటర్లు, వాలెట్ హోల్డర్‌లను తీవ్రమైన నష్టాలకు గురి చేసింది.
ఇది స్టాక్‌ను స్థిరమైన తిరోగమనంలో ఉంచిందని క్వాంట్ మ్యూచవల్ ఫండ్ సందీప్ టాండన్ చెప్పారు. పేటీఎం షేర్లు ఎక్కడి వరకు పడిపోతాయో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శాతం లాభపడింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications