Paytm share price: ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటీఎం షేర్ల ధరలు మరోసారి ఢమాల్ అయ్యాయి. మళ్లీ పాత బాటే పట్టాయి. రెండు రోజుల పాటు వరుసగా అప్పర్ సర్క్యుట్‌ను టచ్ చేస్తూ వచ్చిన పేటీఎం షేర్లు.. హ్యాట్రిక్ కొట్టలేకపోయాయి. ముచ్చటగా మూడో రోజున 4.41 శాతం మేర నష్టపోయాయి.
పేటీఎం షేర్లు గత రెండు రోజులుగా వరుసగా అప్పర్ సర్క్యుట్‌ను తాకుతూ వచ్చిన విషయం తెలిసిందే. బుధ, గురువారాల్లో ట్రేడింగ్ ఆరంభమైన తొలి గంటలోనే 4.99 శాతం మేర పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. వన్97 కమ్యూనికేషన్స్ సంస్థను గౌతమ్ అదానీకి చెందిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు కొనుగోలు చేయబోతోందంటూ వార్తలు రావడమే.

ఇప్పటికే గౌతమ్ అదానీ.. తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారంటూ వార్తలొచ్చాయి. వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ శేఖర్ శర్మతో సంప్రదింపులు సైతం జరిపారనే ప్రచారం మార్కెట్ వర్గాల్లో జోరుగా సాగింది. దీని ప్రభావం పేటీఎం షేర్ల మీద పడ్డాయి. వరుసగా రెండు రోజుల పాటు అవి అప్పర్ సర్క్యుట్‌ను తాకాయి.
ఇదే సానుకూల ప్రభావం కనిపించవచ్చని భావించిన మార్కెట్ వర్గాలకు నిరాశే ఎదురైంది. నేడు పేటీఎం షేర్ల ధరలు మళ్లీ ఢాం అంటూ పడిపోయాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభమైన తొలి అరగంటలో 4.99 శాతం మేర అంటే రూ.396.25 పైసల పెరుగుదల నమోదు చేసుకుని అప్పర్ సర్కుట్‌ను తాకింది.
ఆ ఆనందం ఎక్కవ సేపు నిలబడలేదు నష్టాల్లో ఉన్న ఇన్వెస్టర్లల్లో నిమిషాల వ్యవధిలో ఒక్కసారిగా పడిపోయాయి వాటి రేట్లు. ఇంట్రాడే మొత్తం పుంజుకోలేకపోయాయి. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి షేర్ ఒక్కింటికి 16.65 పైసల నష్టం కనిపించింది. 4.41 శాతం మేర నష్టాన్ని మూటగట్టుకుంది.
దీనికీ కారణం లేకపోలేదు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు తమ కంపెనీని విక్రయించాలనే ఆలోచన ఏదీ లేదంటూ వన్97 కమ్యూనికేషన్స్ సంస్థ యాజమాన్యం తేల్చి చెప్పింది. అసలు అలాంటి ప్రతిపాదన కూడా తమ వద్దకు రాలేదని తేల్చి చెప్పింది. దీని ప్రభావం పేటీఎం షేర్ల ధరలపై పడింది. వాటి రేట్లు తగ్గడానికి కారణమైంది.


Click it and Unblock the Notifications