Paytm Share: పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసు అందుకుంది. ఈ నోటీసు 2015 నుండి 2019 మధ్య కార్యకలాపాలకు సంస్థ అనుబంధ కంపెనీలు లిటిల్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్ (LIPL) అండ్ నియర్బీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (NIPL) లకు సంబంధించినది. అయితే దీనికి సంబంధించి పేటీఎం ఈ సమాచారాన్ని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
పేటీఎంకు ED నోటీసు
LIPL అండ్ NIPLలు వాటి యాజమాన్యంలో లేని కాలానికి సంబంధించిన ఈ ఉల్లంఘనలు ఉన్నాయని పేటీఎం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. "సంస్థ కొనుగోలు చేసిన రెండు కంపెనీలు - లిటిల్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ నియర్బీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - ఆరోపించిన ఉల్లంఘనలు ఇవి కంపెనీ అనుబంధ సంస్థలు కాని కాలానికి సంబంధించినవి" అని ఫైలింగ్ పేర్కొంది. SEBI (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్, 2015 షెడ్యూల్ IIIతో చదవబడిన రెగ్యులేషన్ 30 ప్రకారం, కంపెనీకి 27 ఫిబ్రవరి 2025న 7:27 గంటలకు భారత ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి షోకాజ్ నోటీసు అందినట్లు తెలియజేస్తున్నామని పేటీఎం ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

కంపెనీ తర్వాత ఎం చేస్తుంది?
వర్తించే చట్టాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించడానికి Paytm న్యాయ సలహాను కోరుతోంది. OCL షేర్ చేసిన ఆర్థిక వివరాల ప్రకారం, ఆరోపించిన ఉల్లంఘనలలో భాగంగా OCLకి రూ. 245 కోట్లకు పైగా లావాదేవీలు LIPLకి దాదాపు రూ. 345 కోట్లు, NIPLకి దాదాపు రూ. 21 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ నోటీసు కేవలం వన్97 కమ్యూనికేషన్స్ కు మాత్రమే కాకుండా OCL అండ్ దాని అనుబంధ సంస్థల ప్రస్తుత అలాగే మాజీ డైరెక్టర్లు ఇంకా అధికారులకు కూడా జారీ చేసింది.
సేవలపై ఈ నోటీసు ప్రభావం
దీనికి సంబందించి కస్టమర్లకు అండ్ వ్యాపారులకు అందించే సేవలపై ఎటువంటి ప్రభావం ఉండదని పేటీఎం హామీ ఇచ్చింది. అంతేకాకుండా అన్ని సేవలు పూర్తిగా పనిచేస్తాయి అలాగే ఎప్పటిలాగే సురక్షితంగా ఉంటాయి.
స్టాక్ పై ఒక కన్నేసి ఉంచండి
గత శుక్రవారం పేటీఎం షేర్లు రూ.713.30 వద్ద క్లోజ్ అయ్యాయి. రేపు సోమవారం మార్కెట్ తెరిచినప్పుడు స్టాక్‌ను పరిశీలిస్తారు. ఎందుకంటే ED నోటీసు ప్రభావం స్టాక్‌పై కనిపిస్తుంది. గత 6 నెలల్లో ఈ స్టాక్ 33% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది.


Click it and Unblock the Notifications