డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం వచ్చే మార్చి నాటికి వ్యాపారులకు రూ.1000 కోట్ల రుణాన్ని అందజేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాపారులకు రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.550 కోట్ల రుణాలు అందించింది. ఇప్పుడు రెండింతలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాపారులకు 1 శాతం నుండి 2 శాతం మధ్య వడ్డీ రేటుతో రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు అందిస్తుంది.
బ్యాంకింగ్ రుణాలు అందుకోలేని కిరాణా స్టోర్స్, ఇతర చిన్న వ్యాపారులకు సహాయం చేయడానికి ఈ రుణాలు ఇస్తున్నామని తెలిపింది. తమ వద్ద ఉన్న 17 మిలియన్ వ్యాపారుల డేటా ఆధారంగా వెయ్యి కోట్ల రూపాయల రుణం అందిస్తామని తెలిపింది. ఈ రుణాలు వారి వ్యాపారాన్ని డిజిటలైజ్ చేసుకోవడానికి, కార్యకలాపాల విస్తృతం చేసుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపింది. మార్చి నాటికి ఈ రుణాలు అందిస్తామని తెలిపింది.

వ్యాపారం కోసం పేటీఎం యాప్‌ను ఉపయోగిస్తున్నవారికి మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను అందజేసే ప్రక్రియను కొనసాగిస్తామని ఆ కంపెనీ సోమవారం తెలిపింది. వ్యాపారులు తమ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుని డిజిటల్ ఇండియా కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు ఈ రుణాలు దోహదపడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఎంఎస్ఎంఈలకు పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీపై రూ.5 లక్షల వరకు రుణాలను అందజేసి వాటి అభివృద్ధికి దోహదపడేందుకు నిబద్ధతతో ఉన్నామని పేటీఎం తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications