న్యూఢిల్లీ: టాప్ డిజిటల్ పేమెంట్ కంపెనీ పేటీఎం ఇంకొద్ది రోజుల్లో పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)ను ప్రకటించడానికి సమాయాత్తమౌతోంది. దీనికోసం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ షాక్ తగిలిందా కంపెనీ మేనేజ్‌మెంట్‌కు. పేటీఎం ప్రెసిడెంట్ అమిత్ నయ్యర్ సహా మరో నలుగురు టాప్ ఎగ్జిక్యూటివ్స్ కంపెనీ నుంచి వైదొలగారు. తమ హోదాలకు రాజీనామా చేశారు. దీన్ని అనూహ్య సంఘటనగా అభివర్ణిస్తోన్నాయి కార్పొరేట్ వర్గాలు. పబ్లిక్ ఇష్యూకు వెళ్లబోతోన్న సమయంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడాన్ని అవాంఛిత ఘటనగా భావిస్తోన్నాయి.
పేటీఎం ప్రెసిడెంట్ అమిత్ నయ్యర్‌తో పాటు వేర్వేరు విభాగాధిపతులు నలుగురు కంపెనీ నుంచి తప్పుకొన్నారు. వారిలో మానవ వనరుల విబాగం చీఫ్ రోహిత్ ఠాకుర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అమిత్ వీర్, యూసర్ గ్రోత్ వింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జస్ కరణ్ సింగ్ కపాని, మరొకరు కంపెనీ నుంచి వైదొలిగారు. అమిత్ నయ్యర్ 2019 ఆగస్టులో పేటీఎంలో జాయిన్ అయ్యారు. రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. వారు హఠాత్తుగా తప్పుకోవడానికి కారణాలు తెలియరానప్పటికీ- పేటీఎం బోర్డులో చైనా బిగ్ షాట్స్ చేరిన తరువాతే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అలీబాబా గ్రూపుల్లో ఒకటైన అలీపే ప్రతినిధి గ్ఝియాన్‌డాంగ్, యాంట్ ఫైనాన్షియల్ హెడ్ గువోమింగ్ ఛెంగ్, అలీబాబా నుంచి మైఖెల్ యుయెన్ జెన్ యావో, టింగ్ కెన్నీ హో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఈ మధ్యే పేటీఎంలో జాయిన్ అయ్యారు. వారి రాక తరువాత అమిత్ నయ్యర్ మిగిలిన హెడ్స్ రాజీనామా చేశారని కార్పొరేట్ వర్గాలు భావిస్తోన్నాయి. సామ క్యాపిటల్స్‌కు చెందిన అషిత్ రంజిత్ లలానీ, సాఫ్ట్‌బ్యాంక్ రెప్రజెంటేటివ్ వికాస్ అగ్నిహోత్రి, అమెరికాకు చెందిన డగ్లన్ ఫెజిన్ త్వరలో పేటీఎం బోర్డులో చేరే అవకాశాలు ఉన్నాయంటూ బిజినెస్ పోర్టల్స్ ప్రత్యేక కథనాలను ప్రచురించాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications