రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని, ఇందుకు వెంటనే చర్యలు చేపడతామని పేటీఎం పేమెంట్స్ బ్యాంకు శనివారం ప్రకటించింది. బ్యాంకులో కొన్ని పర్యవేక్షణ లోపాలు గుర్తించడంతో కొత్త ఖాతాలు తెరవడం నిలిపివేయాల్సిందిగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ రెండో రోజుల క్రితం ఆదేశించింది. 2017 మే నెలలో నోయిడా శాఖతో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించిన పేటీఎంపై కొత్త ఖాతాలు తెరువవద్దని ఆర్బీఐ ఆంక్షలు విధించడం ఇది రెండోసారి.

గతంలోను... తక్షణ చర్యలు
గతంలో 2018 జూన్ నెలలోను పర్యవేక్షణ లోపాలు గుర్తించడంతో ఒకసారి నిషేధించింది. ఆ తర్వాత సంస్థ నిబంధనలు పాటించడంతో 2018 డిసెంబర్ 31 నుండి ఆంక్షలు ఎత్తివేసింది. తాజాగా మళ్లీ లోపాలు గుర్తించడంతో కొత్త ఖాతాలు తెరువవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం ఐటీ వ్యవస్థపై సమగ్ర ఆడిట్ నిర్వహించేందుకు, ఒక ఐటీ ఆడిట్ సంస్థను నియమించుకోవాలని కూడా సూచించింది.
ఈ నేపథ్యంలో ఆర్బీఐ స్పందించింది. బ్యాంకు తన ఐటీ సిస్టం సమగ్ర సిస్టం ఆడిట్ నిర్వహణకు ప్రముఖ బాహ్య ఆడిటర్‌ను నియమించడంతో పాటు ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకుంటోందని, వారి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించడానికి రెగ్యులేటర్‌తో కలిసి పని చేయడానికి కట్టుబడి ఉందని పేటీఎం మాతృసంస్థ వన్97 ఓ ప్రకటనలో తెలిపింది.

యూపీఐ ఆధారంగా
ఎక్స్చేంజీలపై కంపెనీ దాఖలు ప్రస్తుత పరిస్థితి ఇప్పటికే వినియోగిస్తున్న కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంది. పేటీఎం యూపీఐ, పేటీఎం వ్యాలెట్, పేటీఎం ఫాస్టాగ్, బ్యాంకు ఖాతాల ప్రస్తుత కస్టమర్లు చెల్లింపుల కోసం డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్స్‌తో సహా ఈ సాధనాలను కొనసాగించవచ్చునని తెలిపింది.
అలాగే కొత్త కస్టమర్లు పేటీఎం యాప్‌లో సైన్-అప్ కావొచ్చు. ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. కస్టమర్లు యూపీఐ హ్యాండిల్స్‌ను సృష్టించి, ఆపై వాటిని వారి బ్యాంకు ఖాతాలకు లింక్ చేయాలి. వారు పేటీఎం యాప్‌లో ట్రాన్సాక్షన్స్ కోసం థర్డ్ పార్టీ చెల్లింపు సాధనాలను కూడా ఉపయోగించవచ్చు. అయితే కస్టమర్లు తదుపరి నోటీసు వరకు వన్97 నిర్దేశించిన కొత్త పీపీబీఎల్ వ్యాలెట్‌లు లేదా పీపీబీఎల్ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాల కోసం సైన్-అప్ చేయలేరు.

నష్టాల్లో..
కొత్త కస్టమర్లపై తాత్కాలిక నిలిపివేత గురించి మాట్లాడుతూ.. పీపీబీఎల్‌పై విధించిన చర్యలు పేటీఎం మొత్తం వ్యాపారాన్ని ప్రభావితం చేయవని పేటీఎం విశ్వసిస్తున్నట్లు తెలిపింది. ఇతర ఆర్థిక సేవల సంస్థల భాగస్వామ్యంతో పేటీఎం అందించే సేవలపై ఆర్బీఐ నిర్దేశం ప్రభావం చూపదని కంపెనీ వివరించింది. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో సోమవారం పేటీఎం స్టాక్ శుక్రవారం స్వల్పంగా క్షీణించి రూ.774.80 వద్ద ముగిసింది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications