Paytm పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు: మీ EMIలు, సబ్‌స్క్రిప్షన్లు ఆగిపోతాయా? వెంటనే ఇలా చేయండి!

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ బ్యాంకింగ్ సేవలలో ఒకటిగా ఉన్న పేటీఎం (Paytm) పేమెంట్స్ బ్యాంక్ (PPBL) లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారికంగా రద్దు చేసింది. ఏప్రిల్ 24, 2026 నాటి ఈ నిర్ణయంతో, ఈ బ్యాంకుకు సంబంధించిన కార్యకలాపాలన్నీ నిలిచిపోనున్నాయి. అయితే, దీనివల్ల కేవలం బ్యాంకింగ్ సేవలు మాత్రమే ప్రభావితం అవుతాయని, మీ డబ్బు ఎక్కడికీ పోదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. కానీ, మీ రోజువారీ పేమెంట్స్ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

Paytm Payments Bank Licence Cancelled Shift EMIs SIPs Auto Pay To Other Banks Safe Refund Process

ఏయే సేవలు ఆగిపోతాయి?

మీరు మీ పేటిఎం (Paytm) పేమెంట్స్ బ్యాంక్ ఖాతాను ఆటో-పేమెంట్స్ కోసం వాడుతుంటే, ఈ క్రింది పనులు ఆగిపోయే అవకాశం ఉంది..

  • EMIలు: మీరు తీసుకున్న లోన్లకు సంబంధించిన ఈఎంఐలు ఆగిపోవచ్చు.
  • SIPలు: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ఫెయిల్ కావచ్చు.
  • OTT సబ్‌స్క్రిప్షన్లు: నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఆటో-డెబిట్ సేవలు నిలిచిపోతాయి.
  • యుటిలిటీ బిల్లులు: కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు వంటివి ఆటోమేటిక్‌గా కట్ కావు.

మీ డబ్బు పరిస్థితి ఏంటి?

ఖాతాదారులందరి డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉందని బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. సేవింగ్స్ అకౌంట్స్, వాలెట్స్, ఫాస్టాగ్స్ (FASTags) , NCMC కార్డుల్లో ఉన్న బ్యాలెన్స్ అంతా సేఫ్. అయితే, ఈ డబ్బును తిరిగి పొందడానికి ఒక క్రమబద్ధమైన 'వైండింగ్-అప్' (Winding-up) ప్రక్రియ జరుగుతుంది.

  1. మొదట మీ అకౌంట్ బ్యాలెన్స్ వెరిఫై చేస్తారు.
  2. ఆ తర్వాత, వేరే బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వమని మిమ్మల్ని అడుగుతారు.
  3. మీ డబ్బును ఆ కొత్త ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు.

పేటియం యాప్ పని చేస్తుందా?

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. పేటీఎం యాప్ , దాని UPI సేవలు యథావిధిగా పనిచేస్తాయి. మీరు వేరే బ్యాంకు ఖాతాను (SBI, HDFC, Axis వంటివి) పేటియం యాప్‌కు లింక్ చేసి ఉంటే, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం పేటియం పేమెంట్స్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నవారికే ఈ సమస్య ఎదురవుతుంది.

మీరు ఇప్పుడు ఏం చేయాలి?

మీ ఆర్థిక లావాదేవీలకు అంతరాయం కలగకుండా ఉండాలంటే ఈ క్రింది పనులు వెంటనే చేయండి..

  • మ్యాండేట్లు మార్చండి: మీ EMIలు లేదా SIPలు పేటియం బ్యాంకు నుంచి కట్ అవుతుంటే, వెంటనే వాటిని వేరే బ్యాంకు ఖాతాకు మార్చండి. లేదంటే పెనాల్టీలు పడటమే కాకుండా, మీ క్రెడిట్ స్కోర్ (CIBIL) కూడా దెబ్బతింటుంది.
  • బ్యాలెన్స్ చెక్ చేసుకోండి: మీ వాలెట్ లేదా అకౌంట్ లో ఉన్న డబ్బును వీలైనంత త్వరగా వేరే బ్యాంకులోకి మార్చుకోవడం మంచిది.
  • ఫాస్టాగ్ అప్‌డేట్: మీ ఫాస్టాగ్ పేటియం బ్యాంక్ తో లింక్ అయి ఉంటే, కొత్త ఫాస్టాగ్ తీసుకోవడం ఉత్తమం.

బ్యాంకు దగ్గర తగినంత లిక్విడిటీ (నగదు) ఉందని, అందరికీ డబ్బులు వెనక్కి వస్తాయని RBI స్పష్టం చేసింది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ, పేమెంట్ ఫెయిల్యూర్స్ వల్ల వచ్చే ఆర్థిక నష్టాలను నివారించడానికి మాత్రం వెంటనే స్పందించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+