Paytm Fastag: దేశీయ పేమెంట్స్ ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారం ఆర్బీఐ కఠిన ఆంక్షల కారణంగా కకావికలం అయ్యింది. దీంతో కంపెనీ వ్యాపారం ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రభావితం అవుతోంది.
సంక్షోభంలో చిక్కుకున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తాజాగా ఫాస్టాగ్ వ్యాపారం నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇది పరోక్షంగా ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి ఇతర పోటీదారులకు భారీగా కస్టమర్లను అందిస్తోంది. ఎయిర్ టెల్ రానున్న 4 నెలల కాలంలో కొత్తగా 10 లక్షల మంది వినియోగదారులకు పొందనున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి పేర్కొన్నారు. ఫిబ్రవరి 15, 2024 నాటికి దాదాపు 1.5 మిలియన్ల యాక్టివ్ ఫాస్టాగ్ కస్టమర్ బేస్ కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మెుత్తంగా 8 మిలియన్ ఫాస్టాగ్‌లను జారీ చేసినట్లు వెల్లడైంది. ఇది అత్యధిక సంఖ్య. ఫిబ్రవరి 16న భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇటీవలి ఆదేశానుసారం Paytm ఫాస్టాగ్ కస్టమర్‌లు తమ ప్రస్తుత బ్యాలెన్స్‌లను ఉపయోగించడానికి అనుమతించబడ్డారు. అయితే వారు కొత్తగా బ్యాలెన్స్ యాడ్ చేయకుండా నిరోధించబడిన సంగతి తెలిసిందే. ఉన్న బ్యాలెన్స్ వినియోగించుకునేందుకు ఎలాంటి డెడ్‌లైన్ తేదీని పెట్టలేదు. ఈ క్రమంలోనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్‌లను జారీ చేయడానికి అధికారం ఉన్న బ్యాంకుల జాబితా నుండి PPBLని తొలగించింది.

ఫాస్టాగ్ సేవల కోసం NHAI జాబితా చేసిన బ్యాంకుల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బంధన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్, కాస్మోస్ బ్యాంక్ సహా మరిన్ని ఉన్నాయి. అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సంక్షోభం తమకు భారీ స్థాయిలో కొత్త వినియోగదారులను అందిస్తుందని ఒక ప్రైవేట్ బ్యాంక్ అధికారి వెల్లడించారు.
ఫాస్టాగ్ ద్వారా వాహనం టోల్ గేటు వద్ద కదులుతుండగానే చెల్లింపులు చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఇందుకోసం ఒక RFID చిప్ వాహన విండ్‌స్క్రీన్‌పై అతికించబడి ఉంటుంది. ఫాస్టాగ్‌కి లింక్ చేయబడిన ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులు జరిపేందుకు ఇది దోహదపడుతుంది. దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారి టోల్ ప్లాజాలు, 100కి పైగా రాష్ట్ర రహదారి టోల్ ప్లాజాలతో సహా 750కి పైగా టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్‌లు పనిచేస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..



Click it and Unblock the Notifications