Paytm Sale: పేటీఎం ట్రావెల్ ఫెస్టివల్ సేల్.. త్వరపడండి.. బస్, ఫ్లైట్ టిక్కెట్లపై సూపర్ ఆఫర్లు..

Paytm Sale: ప్రయాణాలు చేయటమంటే ఇష్టపడేవారికి శుభవార్త. పేటీఎం ట్రావెల్ ఫెస్టివల్ సేల్ లో విమాన టిక్కెట్లను చౌకగా కొనుగోలు చేయవచ్చు. Paytm బ్రాండ్‌కు చెందిన డిజిటల్ పేమెంట్స్ సర్వీసెస్ ఆర్థిక సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ట్రావెల్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది. దీని కింద జులై 21 నుంచి 23 జూలై 2022 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆకర్షనీయమైన డీల్స్, క్యాష్‌బ్యాక్స్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

 దేశీయ విమానాలపై 15 శాతం తగ్గింపు..

దేశీయ విమానాలపై 15 శాతం తగ్గింపు..

Paytm నుంచి అందిన సమాచారం ప్రకారం.. వినియోగదారులు దేశీయ విమానాలపై 15% తగ్గింపు, అంతర్జాతీయ విమాన టిక్కెట్ బుకింగ్‌పై 10% తగ్గింపు ప్రయోజనం పొందుతారు. ఈ ఆఫర్ ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్‌ఏషియా విమానాలకు వర్తిస్తుంది. HSBC కార్డ్ వినియోగదారులు దేశీయ విమానాల్లో 15%, అంతర్జాతీయ విమానాల్లో 10% తగ్గింపును కూడా పొందవచ్చు. సాయుధ బలగాలు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు అదనపు రాయితీలతో ప్రత్యేక ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి.

 బస్ టిక్కెట్లపై ఆఫర్లు..

బస్ టిక్కెట్లపై ఆఫర్లు..

మెగా సేల్ సందర్భంగా.. డిజిటల్ పేమెంట్స్ కంపెనీ యాప్ ద్వారా బస్ టిక్కెట్ల కోసం అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. యాప్ నుంచి బుక్ చేసుకున్న ప్రతి బస్సు టిక్కెట్‌పై క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లు రూ.15 బస్ క్యాన్సిలేషన్ ప్రొటెక్షన్‌ని కొనుగోలు చేయవచ్చు. దీనిని తీసుకోవటం వల్ల టిక్కెట్లను రద్దు చేసుకున్నట్లయితే కస్టమర్లకు 100% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. మొదటి బస్ టికెట్ బుకింగ్‌పై వినియోగదారులు 20% క్యాష్‌బ్యాక్‌ కూడా ప్రయాణికులకు లభిస్తోంది.

మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్..

మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్..

టికెట్ చెల్లింపుల కోసం వినియోగదారులు అన్ని ప్రధాన UPI యాప్‌లు, డెబిట్ కార్డ్‌, క్రెడిట్ కార్డ్‌, ప్రీపెయిడ్ కార్డ్‌లను పేటీఎం ఆమోదిస్తోంది. దీనితో పాటు.. Paytm UPI, Paytm Wallet, Paytm పోస్ట్‌పెయిడ్ సహా కొన్ని ఇతర చెల్లింపు ఆప్షన్ల ద్వారా కూడా టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+