Flight Tickets: అసలే కొత్త సంవత్సరం పైగా త్వరలోనే సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తోంది. ఈ క్రమంలో చాలా మంది తమ సొంత ప్రాంతాలకు ప్రయాణించాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లు చాలా రద్దీగా ఉంటుంటాయి. ఈ క్రమంలో విమాన టిక్కెట్లపై మంచి రాయితీని పొందే అవకాశం ఉంది. ఎలాగంటే..

టిక్కెట్లపై రాయితీ..
కొత్త సంవత్సరంలో విమాన ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది శుభవార్తే. అదేంటంటే.. రాయితీతో కూడిన విమాన టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి పేటీఎం సంస్థ ఒక సదవకాశాన్ని అందిస్తోంది. అలా Paytmలో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై 14% తక్షణ తగ్గింపును పొందవచ్చు. పైగా ఈ తగ్గింపును అన్ని దేశీయ రూట్లలో కంపెనీ అందుబాటులో ఉంచింది.

ఎవరికి అవకాశం..
ఎవరైనా తొలిసారిగా Paytmలో తమ మొదటి విమాన టిక్కెట్‌ను బుక్ చేసుకునే కస్టమర్లకు మాత్రమే ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. మొదటిసారిగా తమ ప్లాట్‌ఫారమ్‌లో ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసుకునే వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు లభిస్తుందని తెలిపింది. అర్హత కలిగిన కస్టమర్లు.. దేశీయ రూట్లలో టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై 14% తక్షణ తగ్గింపును పొందుతారని స్పష్టం చేసింది. ఈ రూపంలో గరిష్ఠందా రూ.1000 తగ్గింపు లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే దీనికి ఎలాంటి కనీస బుక్కింగ్ ఆర్డర్ విలువను నిర్ధేశించలేదు.

ఏఏ విమానాలపై తగ్గింపులంటే..
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం అందించిన వివరాల ప్రకారం.. Vistara, Spicejet, Air Asia, GoFirst, Indigo, Air Indiaతో సహా అన్ని ప్రధాన విమానయాన సంస్థల బుకింగ్‌లపై ఈ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ బుకింగ్‌తో క్యాన్సిలేషన్ ప్రొటెక్షన్‌కు హామీ కూడా ఉందని కంపెనీ చెబుతోంది. అంటే ఎవరైనా తమ టిక్కెట్ రద్దు చేసుకున్నట్లయితే వారికి 100 శాతం డబ్బు వాపసు ఇవ్వబడుతోందని కంపెనీ వెల్లడించింది. విమాన టిక్కెట్ కొనుగోలుకు Paytm UPI, Paytm వాలెట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్‌బ్యాంకింగ్, ఇతర మార్గాల ద్వారా చెల్లింపు చేసుకోవచ్చని తెలుస్తోంది. Paytm అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్ కూడా కావడం గమనార్హం.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications