ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకోవడం బిజినెస్ ఐడియా.. అయితే ఇప్పుడు అంతా ఆన్ లైన్.. అంటే.. కొనుగోలు, విక్రయం అంతా మొబైల్‌లో జరుగుతుంది. సో వినియోగదారులను ఆకట్టుకునేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్ తప్పనిసరి అయ్యింది. అలా ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం కూడా మంచి ఆఫర్ ఇచ్చింది. అదీ కూడా రూపాయికి వంద అనే ఆఫర్ ప్రకటించింది.
నాలుగు రూపాయలకు వంద రూపాయల క్యాష్ బ్యాక్ పేరుతో కొత్త ఆఫర్‌ను పేటీఎం ఆనౌన్స్ చేసింది. UPI మనీ ట్రాన్స్ ఫర్ చేసే కొత్త కస్టమర్లకు ఇది వర్తిస్తుందని చెప్పింది. ఈ నెల 20 వరకు ఆఫర్ వర్తిస్తుందని ఏటీఎం తెలిపింది. రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లు మరింతగా క్యాష్ బ్యాక్ పొందొచ్చని చెప్పింది. రెఫర్ చేసిన వారు, రెఫర్ లింక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన వారిద్దరికి 100 చొప్పున క్యాష్ బ్యాక్ ఇస్తామంది.

ఇందుకోసం క్రికెటర్లు యుజ్వేంద్ర చామల్, హర్బజన్ సింగ్, వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్‌తో ఆన్ లైన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. పేటీఎంతో సూపర్ ఫాస్ట్‌గా, సెక్యూర్డ్‌గా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చని వివరించారు. నిమిషాల వ్యవధిలో పేటీఎం యాప్‌లో రిజిస్టర్ చేసుకుని లావాదేవీలు చేయొచ్చని వివరించారు. ఉచితంగా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
గతేడాది డిసెంబర్‌లో పేటీఎం 936 మిలియన్ల ట్రాన్సాక్షన్లు నమోదు చేసిన సంగతి తెలిసిందే. NPCI డేటా ప్రకారం యూపీఐ ట్రాన్సాక్షన్లలో లీడింగ్‌లో పేటీఏం ఉంది. ఫోన్ పే, గూగుల్‌లో గరిష్టంగా రోజుకు లక్ష ట్రాన్స్ ఫర్ అవుతుంది. కానీ పేటీఎం మాత్రం రూ.10 లక్షల వరకు నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటు ఉంది. సో వ్యాపారులు దీనిని ఎక్కువగా వాడుతున్నారు. ఆ మేరకు కంపెనీ ఆఫర్లు కూడా ప్రకటిస్తోంది.


Click it and Unblock the Notifications