మీకు మంచి సిబిల్ స్కోర్ ఉందా.. అయితే లోన్ ఇస్తామని బ్యాంకులు, కంపెనీలు ఎగబడతాయి. ఇప్పుడు డిజిటల్ కంపెనీలు కూడా వినియోగదారులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. క్షణాల్లో లోన్ తీసుకోవచ్చని బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ పే అనౌన్స్ మెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పేటీఎం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 5 లక్షల వరకు తక్కువ వడ్డీకే లోన్ అందిస్తున్నట్లు వెల్లడించింది. అందుకు ఈఎంఐ ఆప్షన్ సౌకర్యం కూడా కల్పించింది.
ఈ ఆఫర్ చిరు వ్యాపారులకు మాత్రమేనని తెలిపింది. పేటీఎంలో మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద లోన్ పొందవచ్చని తెలిపింది. డిజిలైజేషన్ పద్ధతిలో జరిగే లోన్ ప్రక్రియలో ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా లోన్ తీసుకోవచ్చు. అతని క్రెడిట్ అర్హతను గుర్తించి పేటీఎం యాప్ పెద్ద మొత్తంలో లోన్ మంజూరు చేస్తుంది. అయితే.. లోన్ పొందడానికి వ్యాపారులు యాప్‌లో కొన్ని పద్ధతులును అనుసరించాల్సి ఉంటుంది.

పేటీఎం యాప్ తెరిచి.. బిజినెస్ లోన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అర్హతను బట్టి మీకు వచ్చే లోన్ ఎంతో అక్కడ డిస్ ప్లే అవుతుంది. అందులో రోజువారీ ఈఎంఐ ఎంత ? గడువు దాటితే ఎంత ఫైన్ విధిస్తారు ? ఎన్ని సంవత్సరాల్లో లోన్ కట్టాలి అనే విషయాలు ఉంటాయి. చెక్ బాక్స్ పై క్లిక్ చేసి కొనసాగించడానికి గెట్ స్టార్ట్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. సీకేవైసీ నుంచి కేవైసీలో అనుమతి ఇవ్వడం ద్వారా వ్యాపారి కనీస డాక్యుమెంటేషన్ లోన్ యాప్ ప్రాసెసింగ్ జరుగుతుంది. పాన్ వివరాలు, పుట్టిన తేదీ, అడ్రస్, ఈ మెయిల్ ఇతరత్రా అంశాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అర్హతను బట్టి పేటీఎం యాప్ మీ లోన్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది.
ఇదీ చిరు వ్యాపారులకు మంచి ఆఫరే.. ఎందుకంటే పెట్టుబడి కోసం వారు ఇబ్బందులు పడుతుంటారు. చిటీ అని, ఫైనాన్స్ అని బాధలు ఎక్కువే ఉంటాయి. వ్యాపారం విస్తరించడానికి ఈ లోన్ ఉపయోగపడుతుంది. నిర్ణీత సమయంలో మాత్రం నగదు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే వడ్డీ బాదుడు ఉంటుందని మరచిపోవద్దు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications