ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోమార్ట్ లోకల్ కిరాణా వ్యాపారులు, కస్టమర్లకు సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వాట్సాప్‌తో కలిసి కొన్నిచోట్ల సేవలను అందుబాటులోకి తెచ్చింది. క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించనుంది. జియోమార్ట్ రూపంలో పోటీ పెరుగుతుందని భావిస్తున్న పేటీఎం కొత్త పెట్టుబడులు పెడుతోంది.

వీటి కొనుగోలుకు డిమాండ్
దేశవ్యాప్తంగా మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో నిత్యావసరాల జాబితాలో లేని వస్తువుల కొనుగోలుకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోందని పేటీఎం మాల్ తెలిపింది. దేశంలో లక్షలాది మంది వ్యాపారులకు లాభదాయకంగా మార్చేందుకు పేటీఎం కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చింది. కిరాణా స్టోర్స్ కోసం దీనిని తీసుకు వచ్చింది. అంతేకాదు, పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్ ద్వారా డిజిటల్ చెల్లింపుల అడాప్ట్ కోసం కిరాణా దుకాణాలకు సహాయం చేయడం కోసం రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది.

జియోమార్ట్ థ్రెట్.. పేటీఎం రివార్డ్ పాయింట్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియోమార్ట్‌లో ఫేస్‌బుక్ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. జియో మార్ట్‌లో టెక్ దిగ్గజ కంపెనీ పెట్టుబడులు పేటీఎంకు ముప్పుగానే భావిస్తున్నారు. దీంతో పేటీఎం కొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. పేటీఎం కొత్త లాయాల్టీ ప్రోగ్రాం కింద పేటీఎం వ్యాలెట్, రూపే కార్డ్స్, అన్ని యూపీఏ ఆధారిత పేమెంట్స్ యాప్స్ ద్వారా పేమెంట్స్ తీసుకుంటే రివార్డ్ పాయింట్స్ పొందేందుకు అర్హులు.

పేటీఎం.. బలమైన పెట్టుబడిదారులు
నోయిడాకు చెందిన పేటీఎం కిరాణా స్టోర్స్, దుకాణాల్లో గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. జియోమార్ట్‌కు ఇది ప్రారంభం మాత్రమే. దీంతో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి రావొచ్చు. పేటీఎం వద్ద పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయి. ఇప్పటి వరకు 3.54 బిలియన్ డాలర్ల ఫండ్స్ రాబట్టింది. ఇటీవలి జీ సిరీస్ రౌండ్ ద్వారా 1 బిలియన్ డాలర్లు సమీకరిస్తోంది. సాఫ్ట్‌బ్యాంక్, అలీబాబా, అమెరికాకు చెందిన టీ రో ప్రైస్ వంటి బలమైన పెట్టుబడిదారులను కలిగి ఉంది. ఇక జియోమార్ట్ 9 బిలియన్ డాలర్లు సమీకరించింది. ఫేస్‌బుక్, పీఈ ఫర్మ్ సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టాయి.

MDR చెల్లింపు, రివార్డ్ పాయింట్స్‌కు పరిమితి లేదు
పేటీఎం లాయాల్టీ ప్రోగ్రాం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ ద్వారా వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్ పైన వసూలు చేసిన 1 శాతం MDRని తిరిగి ఇస్తుంది. అలాగే ఒక వ్యాపారి సంపాదించగల రివార్డ్ పాయింట్స్ పైన పరిమితి లేదు. ఇది పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్ ద్వారా చేసిన మొత్తం ట్రాన్సాక్షన్స్ పైన ఆధారపడి ఉంటుంది. డిజిటల్ చెల్లింపులు పేమెంట్స్ చెల్లింపులు అంగీకరించడం ద్వారా కిరాణా దుకాణదారులకు రివార్డ్స్ అందించడం తమ లక్ష్యమని, వ్యాలెట్ లోడ్ పైన బ్యాంకులు ఛార్జీ వసూలు చేస్తుందని, తాము 1 శాతం ఎండీఆర్ తిరిగి ఇవ్వడం ద్వారా వారికి ప్రయోజనం కల్పిస్తున్నట్లు పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌరబ్ శర్మ అన్నారు.

జియోమార్ట్ వేగవంతం
అదే సమయంలో జియోమార్ట్.. వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ తీసుకోవడం ప్రారంభించి కార్యకలాపాలను వేగవంతం చేసింది. వాట్సాప్‌కు 400 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. జియోమార్ట్ ఈ-కిరాణా యుద్ధానికి నాంది పలికిందని చెప్పవచ్చు. ఇప్పటికే జియో మార్ట్‌లో ఫేస్‌బుక్ ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత సిల్వర్ లేక్ పెట్టుబడి పెట్టింది. మరోవైపు సాఫ్ట్ బ్యాంకు, అలీబాబా ఇన్వెస్ట్ చేసిన ఈ పేటీఎం లాభదాయకంగా లేదు. దీని మాతృసంస్థ 2019 మార్చిలో 500 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. మరో ఆసక్తికర విషయం ఏమంటే ఫేస్‌బుక్ - రిలయన్స్ ఒప్పందం వల్ల ఎవరికైనా నిద్రపట్టడం లేదా అంటే అది పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర శర్మ అయి ఉంటుందని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications