AI News: కొన్నాళ్లుగా ఏఐ సాంకేతికత వృద్ధితో ప్రమాదం ఉందని చాలా మంది ఉద్యోగుల్లో ఆందోళన ఉండేది. అయితే అది 100 శాతం నిజమేనని తాజాగా పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.
రోజురోజుకూ ఏఐ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ విభిన్న అవసరాలను తీర్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో కంపెనీలు మనుషులను నియమించుకు వారికి జీతాలు చెల్లించటం కంటే ఈ టూల్స్ పనిలో భాగంగా మార్చుకోవటం వల్ల ఖర్చులు తగ్గించుకోవచ్చని భావిస్తున్నాయి. దేశంలోని ఫిన్ టెక్ స్టార్టప్ పేటీఎం సైతం ఇదే బాటలో పయనిస్తూ.. ఏఐ స్వీకరణకు మెుగ్గుచూపుతోంది. దీనివల్ల మరింత సమర్థవంతమైన వర్క్‌ఫోర్స్, సిబ్బంది డిమాండ్ తగ్గే అవకాశం ఉందని విజయ్ శేఖర్ శర్మ చెప్పటం చాలా మందికి నిద్ర లేకుండా చేస్తోంది.

ఫిన్‌టెక్ సంస్థ ఇప్పటికే క్రమబద్ధీకరించిన కార్యకలాపాలతో సిబ్బంది అవసరాలను తగ్గించింది. రానున్న కాలంలో ఏఐ సాంకేతికత మరింత విస్తృతంగా వినియోగం ద్వారా ఉద్యోగుల అవసరాన్ని మరింతగా తగ్గుదుందని తెలుస్తోంది. అధిక-టిక్కెట్ లెండింగ్, పోస్ట్‌పెయిడ్ లోన్‌ల పట్ల సంప్రదాయవాద విధానంపై దృష్టి సారించడానికి కంపెనీ వ్యూహాత్మక మార్పు దాని Q3 ఆర్థిక ఫలితాల నుంచి స్పష్టం కనిపిస్తుంది. దీని వల్ల కంపెనీ నష్టాలు తగ్గటంతో పాటు రాబడులు 38 శాతం మేర పెరిగాయి.
గడచిన ఏడాదిలో కంపెనీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్ వినియోగం ద్వారా ఖర్చులను 10-15 శాతం మేర తగ్గించుకుంది. ఈ క్రమంలో కొన్ని వందల మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. చాలా మంది నిపుణులు అంచనాల ప్రకారం.. వర్క్‌ఫోర్స్ డిమాండ్‌పై AI ప్రభావం ఉన్నప్పటికీ, సాంకేతిక పురోగతులు చారిత్రాత్మకంగా కొత్త ఉద్యోగ అవకాశాలు, పాత్రలను సృష్టిస్తాయని చెబుతున్నారు. భవిష్యత్తులో ఇందువల్ల కొత్త కెరీర్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications