paytm: నగదు రహిత లావాదేవీలకు పలు మార్గాలు ఉన్నాయి. వాటిలో UPI సేవలు అత్యంత ప్రజాధరణ పొందాయి. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్ లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. తద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారత్ లో ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు UPI ద్వారా సేవింగ్స్ ఖాతాలోని నగదును మాత్రమే ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది. కాగా ఇప్పడు క్రెడిట్ కార్డుతో సైతం చెల్లింపులు చేసే అవకాశం కలిగింది.

ఇక క్రెడిట్ కార్డుతో సైతం..
రూపే క్రెడిట్ కార్డులను వినియోగదారులు UPIతో లింక్ చేసేందుకు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) మంగళవారం తెలిపింది. తద్వారా సేవింగ్స్ ఖాతా నుంచి మాత్రమే కాకుండా క్రెడిట్ కార్డు నుంచి సైతం UPI ద్వారా వ్యాపార లావాదేవీలను నిర్వహించవచ్చని పేర్కొంది.

కార్డులు అవసరం లేదు:
వినియోగదారులు పేటీఎం యాప్ నుంచి QR కోడ్ ను స్కాన్ చేయడంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లో UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ విధానం వల్ల ప్రత్యేకంగా కార్డులు తీసుకెళ్లవలసిన అవసరం ఉండదు. QR కోడ్ పేమెంట్లలో క్రెడిట్ కార్డు వినియోగం వల్ల, క్రెడిట్ ఎకోసిస్టం మరింత మెరుగుపడుతుందని Paytm చెల్లింపుల MD & CEO సురీందర్ చావ్లా ఓ ప్రకటనలో తెలిపారు. తద్వారా వ్యాపారులూ లబ్ధి పొందుతారని వెల్లడించారు.

ఇలా బీజం పడింది:
UPI ద్వారా లావాదేవీలను NPIC నిర్వహిస్తూ ఉంటుంది. ఈ విధానానికి క్రెడిట్ కార్డులనూ లింక్ చేయాలని జూన్ 2022లో రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. క్రెడిట్ కార్డుల వినియోగాన్ని పెంచడానికి, డిజిటల్ చెల్లింపుల పరిధిని విస్తరించడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో RuPay క్రెడిట్ కార్డ్‌లు, UPI మధ్య అనుసంధానం కోసం ఆపరేటింగ్ సర్క్యులర్‌ను NPCI విడుదల చేసింది.

త్వరలో మరిన్ని బ్యాంకులు:
ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన రూపే క్రెడిట్ కార్డులను మాత్రమే ప్రస్తుతానికి UPIకి లింక్ చేయవచ్చు. SBI కార్డ్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ఇతర ప్రముఖ క్రెడిట్ కార్డ్ జారీదారులతోనూ NPCI చర్చలు జరుపుతోంది. ఒకే UPI యాప్ తో అన్ని రకాల చెల్లింపులు, రివార్డులు, ఇతర ప్రయోజనాలనూ రూపే క్రెడిట్ కార్డుల ద్వారా పొందవచ్చని NPCI చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్ తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్ లలో సౌకర్యవంతమైన, వేగవంతమైన చెల్లింపులతో పాటు రూపే కార్డ్‌ల విస్తృత వినియోగానికి ఈ విధానం బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications