Paytm News: అదిరిపోయే ఆఫర్ లాంచ్ చేసిన పేటీఎం.. వినియోగదారులు క్యూ కట్టడం ఖాయం..
Paytm Health Insurance: ఇటీవల బీమా రంగంలో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఒకటికి మించి మరో సంస్థ ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నాయి. ఇటీవలే ఓ ప్రముఖ హాస్పిటల్ చైన్ కూడా ఇదే తరహా సేవలు అందించేందుకు రంగంలోకి దిగింది. తాజాగా పేటీఎం కూడా కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది.
పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తన వ్యాపార భాగస్వాముల కోసం 'పేటీఎం హెల్త్ సాథీ' పేరిట ప్రత్యేక ఆరోగ్య మరియు ఆదాయ రక్షణ ప్లాన్ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది 'పేటీఎం ఫర్ బిజినెస్' యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. సరసమైన ధరలో సమగ్ర ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను తన వ్యాపార భాగస్వామ్య విస్తారమైన నెట్‌వర్క్‌కు అందించాలనే లక్ష్యంలో దీన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది.

పేటీఎం హెల్త్ సాథీలో భాగమయ్యేందుకు కేవలం 35 నెలవారీ సబ్‌స్క్రిప్షన్ చెల్లిస్తే సరిపోతుంది. తద్వారా సంస్థ భాగస్వామ్య నెట్‌వర్క్‌లో అపరిమిత డాక్టర్ టెలికన్సల్టేషన్ మరియు ఇన్-పర్సన్ డాక్టర్ విజిట్ (OPD)లతో కూడిన కలిగి అనేక రకాల సేవలను పొందవచ్చు. ప్రమాదాలు లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యాపారానికి అంతరాయాలు కలిగితే ఆదాయ రక్షణ కవరేజీని కూడా అందిస్తుంది.
డాక్టర్ టెలికన్సల్టేషన్ సర్వీస్ ద్వారా ప్రముఖ ఫార్మసీలలో డిస్కౌంట్లు మరియు డయాగ్నస్టిక్ టెస్ట్‌లతో సహా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. క్లెయిమ్ ప్రక్రియ కూడా పూర్తిగా క్రమబద్ధీకరించబడి ఉందని పేటీఎం చెబుతోంది. యాప్‌లో కేవలం కొన్ని క్లిక్‌లతో ఈ వ్యవహారాన్ని పూర్తి చేయవచ్చని పేర్కొంది. దీని పైలట్ స్కీమ్ మేలో ప్రారంభం కాగా ఇప్పటికే 3 వేల మంది వ్యాపార భాగస్వాములు రిజిస్టర్ అయ్యారు. అదికాస్తా విజయం సాధించడంతో ఈ నెల ప్రారంభంలో ఇతర వ్యాపారులందరికీ ఈ ఫీచర్‌ను అందించేందుకు పేటీఎం రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications