Zomato, Paytm: జొమాటో, పేటీఎం మధ్య డీల్.. లేఖ రాసిన విజయ్ శేఖర్ శర్మ..
జొమాటోతో డీల్‌ను ప్రకటించిన తర్వాత పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వాటాదారులకు లేఖ రాశారు. ఇప్పుడు తాము తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి సారించడం ద్వారా లాభదాయకమైన మోడల్‌ను రూపొందించడంపై దృష్టి పెడతామన్నారు. పేటీఎం కోసం లాంగ్ టర్మ్ ప్లాన్‌ను సిద్ధం చేశామని వివరించారు. అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు. వన్ 97 కమ్యూనికేషన్స్ తన వాటాలో 100 శాతం జొమాటోకి విక్రయించనున్నట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
నగదు రహిత, రుణ రహిత మోడల్‌పై ఈ ఒప్పందం జరిగింది. పేటీఎం ఎంటర్‌టైన్‌మెంట్ టిక్కెట్ బిజినెస్ టీమ్‌లో పనిచేస్తున్న 280 మంది ఉద్యోగులను కూడా జొమాటోకి బదిలీ చేయనున్నారు. సినిమా టిక్కెట్లు, క్రీడలు, ఈవెంట్‌ల టిక్కెట్‌లు సంవత్సరం పాటు పేటీఎం Paytm యాప్‌లో అందుబాటులో ఉంటాయి. పీటీఎం.. టికెట్ న్యూ, ఇన్ సైడర్ ను రూ. 268 కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ నిషేధం విధించిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం తమకు చాలా కష్టమైందని విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. కానీ, దీని నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు వివరించారు. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో నగదు ప్రవాహాన్ని పెంచడం తమ ప్రాధాన్యతగా పేర్కొన్నారు. కంపెనీ ఇప్పుడు ఏఐ వినియోగాన్ని కూడా పెంచనున్నట్లు ప్రకటించారు. దీంతో పేటీఎం షేర్లు గురువారం 1.82 శాతం పెరిగాయి.
అయితే పేటీఎం ఐపీఓగా వచ్చిన నుంచి షేరు హోల్డర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. పేటీఎం షేర్లు ఐపీఓ ప్రైస్ కంటే భారీ డిస్కౌంట్ లో ట్రేడవుతున్నాయి.


Click it and Unblock the Notifications