Paytm Payments Bank: ఫిన్‌టెక్ యూనికార్న్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 తర్వతా ఎటువంటి క్రెడిట్ లేదా డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ చేపట్టవద్దని ఆదేశించింది. అయితే మార్చి 1 నుంచి పేటీఎం యాప్ పనిచేస్తుందా లేదా అని పలువురిలో సందేహం తలెత్తుతోంది.
ఆర్‌బీఐ నిర్ణయంతో పేటీఎం వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఫిబ్రవరి 29 తర్వాత యాప్‌ను వినియోగించే అవకాశం ఉండదని చాలామంది భావిస్తున్నారు. దీనిపై కంపెనీ వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ X వేదికగా స్పందించారు. గడువు తేదీ తర్వాత కూడా యాప్ పనిచేస్తుందంటూ భరోసా ఇచ్చారు.

'ఫిబ్రవరి 29 తర్వాత కూడా మీ ఇష్టమైన పేటీఎం యాప్ యథావిధిగా పనిచేస్తుంది. ఎదురయ్యే ప్రతి సవాలుకు ఓ పరిష్కారం ఉంటుంది. దేశ ప్రజలకు సేవలు అందించేందుకు హృదయపూర్వకంగా కట్టుబడి ఉన్నాము. చెల్లింపు వ్యవస్థ, ఆర్థిక సేవల్లో ఇండియా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను పొందుతుంది. ఈ ప్రయాణంలో PaytmKaro అతిపెద్ద ఛాంపియన్‌గా ఉంటుంది' అని విజయ్ శేఖర్ శర్మ పోస్ట్ చేశారు.
ఖాతాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు సహా ఇతర సాధనాల్లో ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్ లేదా టాప్-అప్ చేయడాన్ని నిలిపివేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను ఆర్బీఐ ఆదేశించింది. అయితే వినియోగదారులు తమ ఖాతాలో అందుబాటులో ఉన్న నగదును విత్‌డ్రా చేసేందుకు అనుమతించింది. ఇప్పటికే మార్చి 11, 2022 నుంచి కొత్త క్లయింట్‌లను స్వీకరించకుండా నిషేధించింది. కాగా ఆర్బీఐ తాజా నిర్ణయం కంపెనీని మరింత ఇబ్బందులోకి నెట్టింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications