Paytm Crisis: దేశంలోని డిజిటల్ చెల్లంపుల వ్యవస్థను పరిచయం చేయటం నుంచి భారీ స్థాయిలో విస్తరింపచేయటంలో పేటీఎం సంస్థది పెద్ద చరిత్ర ఉంది. అయితే 2017 నుంచి ఇప్పటి వరకు అనేక మార్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విషయంలో ఆర్బీఐ నుంచి రెగ్యులేటరీ పెనాల్టీను సంస్థ ఎదుర్కొంది.
భయం లేదు. దురాశ లేదు. అత్యాస లేదు అంటూ.. ఇండియాస్ మోస్ట్ సిన్సియర్ బ్యాంక్ ఇక్కడ ఉందంటూ పేటీఎం సంస్థ తన ప్రకటనతో మార్కెట్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే జనవరి 31న నిబంధనలు పాటించడం లేదం పేదంటూ.. మార్చి నుంచి ఇప్పటికే ఉన్న ఖాతాల్లో కొత్త డిపాజిట్లను స్వీకరించడాన్ని నిలిపివేయమని బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్‌బీఐ కఠిన ఆంక్షలను ప్రకటించింది. అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన లైసెన్స్ పొందిననాటి నుంచి దాదాపు 5 సార్లు రెగ్యులేటరీ పెనాల్టీను ఇప్పటి వరకు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే వీటి నుంచి ఫిన్‌టెక్ సంస్థ ఏం నేర్చుకుందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

అనేక మార్పు స్టార్టప్ కంపెనీ పేటీఎం తన పనితీలో తప్పిదాలకు పాల్పడిందని అందుకే కఠినంగా వ్యవహరించక తప్పలేదని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ వ్యవహారంపై స్పష్టతను ఇచ్చారు. అయితే ప్రస్తుతం వివాదాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు విజయ్ శేఖర్ శర్మ టీమ్ ఒక అడ్వైజరీ ప్యానెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంక్ పరిశీలన తర్వాత కంప్లయన్స్ అండ్ రెగ్యులేటరీ అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
కంపెనీ ఆర్థిక సేవల సమగ్రతను కాపాడేందుకు, దాని వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి కీలకమైన కంపెనీ కంప్లైయన్స్ గార్డ్‌రైల్‌లను బలోపేతం చేయడానికి పేటీఎం బోర్డుతో తాజాగా ఏర్పాటు చేస్తున్న కమిటీ కలిసి పని చేస్తుందని వెల్లడైంది. మనీలాండరింగ్ చర్యలేమీ కంపెనీపై లేవని తేలటంతో పేటీఎం కంపెనీ షేర్లు తిరిగి పుంజుకున్నాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం 12.04 గంటల సమయంలో పేటీఎం స్టాక్ ధర ఎన్ఎస్ఈలో 6.16 శాతం క్షీణించి రూ.419 స్థాయి వద్ద తన ట్రేడింగ్ కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications