యాహూ.. పేటీఎం సిలిండర్ ఆఫర్ పొడగింపు.. ఈ నెల 30 వరకు ఎక్స్‌టెండ్
తొలిసారి యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే కస్టమర్లకు అందిస్తోన్న క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పేటీఎం పొడిగించింది. పేటీఎం వినియోగదారులు జూన్ 30 వరకు తాము బుక్ చేసే ఎల్పీజీ సిలిండర్లపై క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్‌తో వినియోగదారులు రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు రూ. 800 నుంచి 850 మధ్యలో ఉండగా.. ఈ క్యాష్ బ్యాక్‌తో వినియోగదారులు తమ సిలిండర్‌ను ఉచితంగా పొందినట్లు అవుతుంది.
మొదట ఈ ఆఫర్‌ను మే 31 వరకే అని ప్రకటించిన పేటీఎం.. దాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు ముందుగా తమ ఫోన్‌లో పేటీఎం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 'బుక్ గ్యాస్ సిలిండర్' సెక్షన్‌కి వెళ్లి తమ డీలర్ షిప్‌ను ఎంచుకోవాలి. (భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, ఇండేన్ లాంటివి). అనంతరం గ్యాస్ ప్రొవైడర్ వివరాలు, కన్జూమర్ నంబర్, మొబైల్ నంబర్ లేదా ఎల్పీజీ ఐడీ తదితర వివరాలు నమోదు చేసి బుకింగ్ ప్రక్రియ
ప్రారంభించాలి.

బుకింగ్ చేసేముందు రూ. 800 క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఎంచుకోవాలని.. మొదటిసారి బుక్ చేసే కస్టమర్లకు ఇది ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది. ఆ తర్వాత పేమెంట్ చేసిన 48 గంటల్లోగా ఒక స్క్రాచ్ కార్డు వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డును గీకితే ఈ ఆఫర్‌లో భాగంగా మీరు ఎంత గెలుపొందారో తెలుసుకోవచ్చు. ఈ స్క్రాచ్ కార్డును ఏడు రోజుల్లో స్కాచ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆఫర్ బెనిఫిట్స్ పొందలేరు. ఈ ఆఫర్ రూ. 500, ఆపైన జరిపే బుకింగ్ చెల్లింపులపై మాత్రమే వర్తిస్తుంది. ఆఫర్ చెల్లుబాటు కాలంలో వినియోగదారులు ఒక్కసారే మాత్రమే ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications