Paytm News: సంక్షోభంలో ఉన్న పేటీఎంకు సిబ్బంది షాక్.. CEO మీటింగ్‌పైనే సంస్థ ఆశలు
Paytm employees: కరోనా విజృంభణ వేళ కాంటాక్స్ లెస్ పేమెంట్స్‌తో మార్కెట్లో ప్రభంజనం సృష్టించిన పేటీఎం పరిస్థితి ఇప్పుడు అధ్వానంగా తయారైంది. RBI ఆంక్షలతో బిజినెస్ ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అర్థంకాక కంపెనీ CEO తల పట్టుకున్నారు. ఈ కష్టకాలంలో ఉద్యోగులు తీసుకున్న నిర్ణయం సంస్థను మరింత ఇబ్బందుల్లోకి తీసుకెళ్లేలా ఉందని సమాచారం.
దాదాపు అన్ని ప్రధాన బ్యాంకింగ్ సేవలను అందించకుండా పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించింది. తద్వారా కంపెనీకి మరిన్ని నియంత్రణ సమస్యలు ఎదురవుతాయని సంస్థ ఉద్యోగులు భయపడుతున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. దీంతో PPBL సహా దాని మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ ఉద్యోగులు తమదారి వారు చూసుకుంటున్నారు.

కొత్త ఉద్యోగాలను వెతుక్కుంటూ సిబ్బంది రిక్రూటర్‌ల వైపు పరుగులు తీస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్, సేవల రంగాలకు సంబంధించిన ఇతర కంపెనీల్లో తక్కువ స్థాయితో పాటు వేతన కోతలకు సైతం సిద్ధంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. సంస్థ భవిష్యత్తుపై ఉద్యోగుల భయాందోళనలను CEO విజయ్ శేఖర్ శర్మ వర్చువల్ టౌన్ హాల్ ద్వారా నివృత్తి చేశారు. దీని తర్వాతైనా తమ నిర్ణయం మార్చుకుంటారేమో చూడాల్సి ఉంది.
పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షల కారణంగా ఉద్యోగులు ఇతర కంపెనీలవైపు చూస్తున్నట్లు AI/ML ఆధారిత రిక్రూట్‌మెంట్ మార్కెట్‌ప్లేస్ MyRCloud CEO రామచంద్రన్ తెలిపారు. డేటా సైన్స్, బ్యాక్-ఎండ్ ఇంజనీర్లు మరియు ఇతర టెక్ టాలెంట్‌లతో సహా విభిన్న ప్రతిభావంతులు రెజ్యూమ్స్ అప్‌లోడ్ చేస్తున్నట్లు చెప్పారు. దాదాపు 400 CVలు షేర్ చేయగా.. వారిలో జూనియర్స్ సహా మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయి సిబ్బంది ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications