Paytm News: భారతీయ ఫిన్‌టెక్ రంగంలో సంచలనం సృష్టించిన పేటీఎంకు ప్రస్తుతం ట్రైం బాగోలేదు. నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్నెర్ర చేయడంతో వ్యాపారం తీవ్ర ఒడిదుకులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించడంతో షేర్ విలువ భారీగా పడిపోయింది. కాగా ఇప్పుడు మరో సంస్థ పేటీఎంకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా జరిగిన 2 లావాదేవీలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పేటీఎంకు అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో పేటీఎం తన ఫైలింగ్‌లో అన్ని రెగ్యులేటరీ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించినట్లు తెలిపింది. అయితే ఈ లావాదేవీలు వరుసగా 3.24 బిలియన్ మరియు 360 మిలియన్ రూపాయలు అని వార్తలు వస్తున్నాయి.

జూలై 15న సెబీ నుంచి పేటీఎంకు ఇందుకు సంబంధించి ఓ లేఖ అందినట్లు నివేదికలు చెబుతున్నాయి. పేటీఎం కంప్లయన్స్ క్లెయిమ్‌లు మరియు బోర్డ్ అండ్ ఆడిట్ కమిటీ సమీక్షించిన మెటీరియల్ లావాదేవీల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అందులో సెబీ పేర్కొంది. ఇందుకు సమాధానంగా తాము అన్ని రెగ్యులేషన్స్ పాటిస్తున్నామని, కాలక్రమంలో వచ్చిన పలు నిబంధనల సవరణలు మరియు అప్‌డేట్స్ కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు బదులిచ్చింది.
సెబీ పంపించిన లేఖ కంపెనీ ఆర్థిక, ఆపరేషనల్ లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపదు అని పేటీఎం స్పష్టం చేసింది. అడ్మినిస్ట్రేటివ్ హెచ్చరిక వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని వాటాదారులకు హామీ ఇచ్చింది. మరోసారి పేటీఎంపై రెగ్యులేటరీ యాక్షన్ తీసుకోనున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని వివరించింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?



Click it and Unblock the Notifications