Paytm News: దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంతో పాటే వేగంగా యూపీఐ మోసాలు కూడా రోజూ వెలుగులోకి వస్తున్నాయి. సాంకేతికతను ఈజీ మనీ కోసం కొందరు తప్పుగా వినియోగించుకోవటాన్ని అరికట్టాలని కంపెనీలు నూతన సాంకేతికతలను తీసుకొస్తున్నాయి. అలాగే వినియోగదారులకు సమర్థవంతమైన కస్టమర్ కేర్ సేవలను అందించాలని చూస్తున్నాయి.
ఈ క్రమంలో తాము పేటీఎం ప్లాట్‌ఫారమ్‌లో నూతన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈ ప్లాట్‌ఫారమ్ గత సంవత్సరంలో అభివృద్ధి చేయబడిందని.. ఇది మోసాలను గుర్తించటం, కస్టమర్ కేర్, కస్టమర్ ఆన్‌బోర్డింగ్ వంటి విభాగాల్లో వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ సాంకేతికత మానవులు చేసే చాలా పనులను భర్తీ చేయగలదని తెలిపారు.

జనరేటివ్ ఏఐ టెక్నాలజీని తీసుకురావటం ద్వారా సేవలు మరింత సమర్థవంతంగా మారటమే కాక.. వ్యాపారాన్ని కొత్త స్థాయి పరిష్కారాలకు స్కేల్ చేయడంలో సహాయపడతాయని శర్మ వెల్లడించారు. ఇది ఆటోమెటిక్‌గా లేదా వినియోగదారు ఇచ్చిన ప్రాంప్ట్ ఆధారంగా కొత్త కంటెంట్, కోడ్ లేదా సింథటిక్ డేటాను ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. పైగా ఇది ఖరీదుతో కూడుకున్నదని తెలిపారు.
గత కొన్ని త్రైమాసికాలుగా పేటీఎం సంస్థ వేగవంతమైన ఆదాయల వృద్ధితో నష్టాలను తగ్గించుకుంటోంది. ఇటీవల విడుదలైన నాలుగో త్రైమాసిక గణాంకాల ప్రకారం పేటీఎం ఆదాయం 52 శాతం పెరిగి రూ.2,335 కోట్లకు చేరుకోగా.. నష్టాలు భారీగా తగ్గి రూ.168 కోట్లకు పరిమితమయ్యాయి. ఇది మార్కెట్లో కంపెనీ పెరుగుతున్న వాటా, సామర్థ్యాలను ప్రతిబింబిస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications