Year Ender 2023: వామ్మో.. వాటికోసం రూ.2 లక్షలు వెచ్చించిన విజయశేఖర శర్మ..!
Vijay Shekhar Sharma: కేవలం ఒక్క రోజులో 2024 వచ్చేస్తోంది. ఈ క్రమంలో చాలా మంది గడచిన ఏడాదిలో తాము వేటిపై అధికంగా ఖర్చుచేశాం అనే వివరాలను పరిశీలించుకుంటుంటారు.
ఈ క్రమంలోనే ప్రముఖ ఫిన్ టెక్ స్టార్టప్ పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తన డిజిటల్ చెల్లింపులను పరిశీలించారు. 2023లో అత్యధికంగా శర్మ ఆహారానికి ఎక్కువగా పేమెంట్స్ చేసినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఆయన తన పేటీఎం చెల్లింపుల రీక్యాప్ వివరాలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ఎక్స్‌లో పంచుకున్నారు.

స్క్రీన్‌షాట్‌ల ప్రకారం విజయ్ శేఖర్ శర్మ 2023లో జొమాటోకు పేటీఎం ద్వారా 95 చెల్లింపులు చేశారు. దీని తర్వాత పేటీఎం కార్యాలయం ఉన్న నోయిడాలోని స్కైమార్క్ వన్‌లోని హల్దీరామ్ అవుట్‌లెట్‌కు అత్యధికంగా 14 చెల్లింపులు జరిపారు. ఇక టాప్-3 చెల్లింపుల్లో బికనీర్‌వాలా 11 చెల్లింపులతో నిలిచింది. ఆ తర్వాత దిల్లీలో దిగ్గజమైన కురేమల్ కుల్ఫీని శర్మ 10 సార్లు ఆర్డర్ చేశారు. ఈ సంవత్సరంలో తాను చేసిన అతిపెద్ద చెల్లింపుల సంఖ్య ఆహారం కోసమేనని అందులో పేర్కొన్నారు. ఇతర Paytm వినియోగదారులను కూడా వారి వార్షిక రీక్యాప్‌ని తనిఖీ చేయవలసిందిగా శర్మ కోరారు.
పేటీఎం మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఈ వారం ప్రారంభంలో దాని 2023 రీక్యాప్‌ను విడుదల చేసింది. తమ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు చెల్లించే అత్యంత సాధారణ మొత్తం రూ.20. దిల్లీలో ఉదయం 12 నుంచి 6 గంటల మధ్యలో గరిష్ఠంగా చెల్లింపులు నమోదయ్యాయని పేర్కొంది. ఇదే క్రమంలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, గోవా వంటి ప్రదేశాలను రాత్రి చెల్లింపుల్లో దిల్లీ అధిగమించిందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications