సిలిండర్ బుకింగ్‌పై రూ.2700 క్యాష్ బ్యాక్, అదిరిపోయే ఆఫర్

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల యాప్ పేటీఎం అదిరిపోయే ఆపర్ ప్రకటించింది. తమ యాప్ ద్వారా LPG సిలిండర్‌ను బుక్ చేసుకునే వారికి క్యాష్‌బ్యాక్‌తో పాటు రివార్డు పాయింట్స్, ఇతర ప్రయోజనాలు ప్రకటించింది. తొలిసారి పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే యూజర్ల కోసం 3 pe 2700 cashback offerను తీసుకు వచ్చింది. వీరు గ్యాస్‌ను బుక్ చేసుకుంటే ఒక్కో నెల గరిష్టంగా రూ.900 వరకు క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. వరుసగా మూడు నెలల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంటే మొత్తం రూ.2700 వరకు లబ్ధి చేకూరుతుంది.

పాత యూజర్ల కోసం కూడా పేటీఎం మరో ఆఫర్‌ను తీసుకు వచ్చింది. వీరు చేసే ప్రతి గ్యాస్ బుకింగ్‌కు 5000 క్యాష్ బ్యాక్ పాయింట్లు పొందవచ్చు. వీటిని ఇతర కొనుగోలుకు వినియోగించవచ్చు. ఇండేన్, HP, భారత్ గ్యాస్ వినియోగదారులకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

Paytm cashback offer up to Rs.2,700 on LPG cylinder booking

అంతేకాదు, కస్టమర్లు తమ గ్యాస్ బిల్లును వచ్చే నెల చెల్లించే సదుపాయాన్నీ పేటీఎం కల్పించడం గమనార్హం. పేటీఎం పోస్ట్‌పెయిడ్‌లో భాగంగా Paytm Now Pay Later ప్రోగ్రాం కింద ఈ ఆఫర్‌ను తీసుకు వచ్చింది. అయితే ఈ ఆఫర్లు ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందిస్తారు. ఆగస్ట్ 31వ తేదీ లోపు తొలి గ్యాస్ బుక్ చేసుకొని ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత అక్టోబర్ 21వ తేదీ వరకు ప్రతి నెల చేసే తొలి సిలిండర్ బుకింగ్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

అక్టోబర్ 31వ తేదీ వరకు చెల్లింపు చేసి స్క్రాచ్ కార్డు పొందవచ్చు. క్యాష్ బ్యాక్ స్క్రాచ్ కార్డు రూపంలో వస్తుంది. కాలపరిమితి ఏడు రోజులే. కార్డును స్క్రాచ్ చేసిన డెబ్బై రెండు గంటల్లో డబ్బులు పేటీఎం వ్యాలెట్‌లో జమ అవుతాయి.

పేటీఎం గత ఏడాది HP గ్యాస్‌తో జత కట్టి Book a Cylinder సౌకర్యాన్ని తీసుకు వచ్చింది. అలాగే ఇండేన్ ఆయిల్‌కు చెందిన ఇండేన్, భారత్ గ్యాస్‌లతోను జత కట్టింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+