Paytmకు గుడ్‌బై చెప్పిన PwC.. కొత్త ఆడిటర్‌గా కోల్‌కతా సంస్థ నియామకం
Paytm: ప్రముఖ పేమెంట్స్ అగ్రిగేటర్ Paytm ఆడిటింగ్ విషయంలో కీలక మార్పు జరిగింది. ఇప్పటి వరకు ఆడిట్ సేవలందించిన ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్(PwC)ఆ బాధ్యతల నుంచి తప్పుకోగా.. మరో కంపెనీకి అప్పగించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో Paytm పేర్కొంది. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడటే గమనార్హం.
ఇటీవల మార్చిలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)లోనే Paytm ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆడిటర్ PwC ఐదేళ్ల టర్మ్ పూర్తికావడంతో కొత్త ఆడిటర్ గా కోల్ కతాకు చెందిన SR బాట్లిబోయ్&అసోసియేట్స్ LLPని దాని స్థానంలో నియమించాలని తీర్మానించింది. కాగా ఆగస్టు 7 నుంచి దానిని అమల్లోకి తీసుకొచ్చింది.

'మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి చట్టబద్ధమైన ఆడిట్ ను మేము పూర్తి చేశాము. మే 2, 2023న మా నివేదికలు విడుదల చేశాము. మరికొన్ని స్పెషల్ పర్పస్ ఆర్థిక నివేదికలపై పరిమిత సమీక్షను కంప్లీట్ చేసి జూన్ 30 మరియు జూలై 19న రిపోర్టులు ఇచ్చాము' అని రాజీనామాకు ముందు PwC పేర్కొంది.
Paytm మాతృసంస్థ One 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, CEO విజయ్ శేఖర్ శర్మ, యాంట్ ఫిన్ కు మధ్య నిన్న ఓ ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. దీని ప్రకారం Paytmలో శర్మ 10.3 శాతం వాటా కొనుగోలు చేయనున్నారు. తద్వారా శర్మ, ప్రమోటర్ సంస్థలు కంపెనీలో అతిపెద్ద వాటాదారులుగా మారనున్నారు.


Click it and Unblock the Notifications