upi: దేశంలో ఎక్కడ చూసినా నగదు రహిత లావాదేవీలే కనిపిస్తున్నాయి. ప్రధానీ మోడీ సైతం భవిష్యత్తులో డబ్బు కంటే నగదు రహిత చెల్లింపుల సంఖ్యే అధికంగా ఉంటుందని ఇటీవల అభిప్రాయపడ్డారు. UPI సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా లావాదేవీలకు నవశకం మొదలైందని చెప్పవచ్చు. ఈ పద్ధతి ద్వారా నగదు రహిత చెల్లింపులను మొదటగా దేశ ప్రజల్లోకి విపరీతంగా తీసుకువెళ్లిన ఘనత మాత్రం Paytm కే దక్కుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. తాజాగా తన యాప్ లో ఇప్పడు మరో సౌకర్యాన్ని అందిస్తోంది.

లావాదేవీ విఫలమయ్యే ప్రసక్తే లేదు
UPI వ్యవస్థ దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన చెల్లింపు విధానం. వివిధ యాప్ లు బ్యాంకులతో కలిసి తమ వినియోగదారులకు ఈ సౌకర్యం అందిస్తున్నాయి. అయితే కొన్ని సార్లు లావాదేవీలు ఫెయిల్ కావడంతో చిన్న చిన్న దుకాణాల వద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
దీనిపై దేశ వ్యాప్తంగా అసంతృప్తి ఉంది. దీనిని కట్టడి చేసేందుకు ఇప్పుడు Paytm ఓ సేవను అందుబాటులోకి తెచ్చింది. అదే UPI LITE. ఈ విధానంలో లావాదేవీలు విఫలం కావడం అనే సమస్యే ఉండదని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.

అందుకే కొత్త సేవ
భారత స్వదేశీ యాప్ Paytm, ప్రస్తుతం UPI LITE సేవలు అందించే ఏకైక ప్లాట్ ఫారమ్. ఒక్క ట్యాప్ తో వేగవంతమైన, రియల్ టైమ్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తోంది. UPI పేమెంట్లలో సక్సెస్ రేటు ఉన్నప్పటికీ, పీక్ లావాదేవీల వేళల్లో కొన్నిసార్లు చెల్లింపులు విఫలం కావడం చూస్తేనే ఉన్నాం.
దీనిని అడ్డుకుంటూ, వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్తగా ఈ సేవను ప్రారంభించింది.

పిన్ అవసరం లేకుండానే..
దేశవ్యాప్తంగా ప్రజలకు డిజిటల్ చెల్లింపులను మరింత అందుబాటులోకి తీసుకురావాలని Paytm లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం UPI LITE సర్వీసును ప్రవేశపెట్టినట్లు తెలిపింది. PIN ఉపయోగించకుండానే రూ.200 లేదా అంతకంటే తక్కువ విలువ కలిగిన లావాదేవీలు నిర్వహించడానికి ఈ విధానం సహాయపడుతుంది.
అంతే కాకుండా ప్రతిరోజూ LITE లావాదేవీల జాబితాతో కూడిన ఓ SMSను ఆయా బ్యాకులు వినియోగదారులకు పంపిస్తాయి. తద్వారా ఖాతా స్టేట్ మెంట్ కోసం ఎదురు చూడకుండా ఏరోజు లావాదేవీలను ఆరోజే, ఒకేచోట సరిచూసుకునే అవకాశం లభిస్తుంది.

ఇవీ మద్ధతిస్తున్న బ్యాంకులు
Paytm UPI LITEకి ప్రస్తుతం కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి 9 బ్యాంకులు మద్దతు ఇస్తున్నాయి.
యాప్ లో ఈ సేవను యాక్టివేట్ చేసుకోవడం కోసం రూ.1,000 యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.100 క్యాష్ బ్యాక్ ను సైతం కంపెనీ అందిస్తోంది.


Click it and Unblock the Notifications