జీతం నుంచే నేరుగా SIP పెట్టుబడి! సెబీ కొత్త ప్లాన్‌తో టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయా?
సాలరీ ఉద్యోగులు ప్రతి నెలా పొదుపు చేసుకునేందుకు మార్కెట్ రెగ్యులేటర్ 'సెబీ' (SEBI) ఒక సూపర్ ప్రపోజల్‌ను తీసుకొచ్చింది. అదే పెరోల్ లింక్డ్ మ్యూచువల్ ఫండ్ SIP. అంటే, ప్రతి నెలా మీ జీతం నుండి పీఎఫ్ (EPF) డబ్బులు ఎలాగైతే కట్ అవుతాయో.. అలాగే మీరు ఓకే అనుకుంటే మీ జీతం నుండి నేరుగా మ్యూచువల్ ఫండ్స్ లోకి SIP అమౌంట్ కట్ అయిపోతుంది. వినడానికి ఇది చాలా బాగుంది కదా! అయితే, ఈ ప్రపోజల్ రాగానే ఉద్యోగుల్లో ఒక పెద్ద డౌట్ మొదలైంది. ఈపీఎఫ్ (EPF) లేదా ఎన్‌పీఎస్ (NPS) లాగే ఈ పెరోల్ SIP కి కూడా ఆదాయపు పన్ను (Income Tax)మినహాయింపులు ఉంటాయా?
ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం.. దీనికి సమాధానం 'లేదు' అనే చెప్పాలి! ఎందుకని? దీని వెనుక ఉన్న అసలు కారణాలు, ఇతర ఆప్షన్స్ ఏంటో సింపుల్‌గా తెలుసుకుందాం.

టాక్స్ బెనిఫిట్ ఎందుకు ఉండదు?
మనం ఈపీఎఫ్ లేదా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, ఆ డబ్బు మన చేతికి రాకముందే (అంటే టాక్స్ పడకముందే) కట్ అవుతుంది. దీనివల్ల మన ట్యాక్సబుల్ ఇన్‌కమ్ తగ్గుతుంది. కానీ, సెబీ ప్రతిపాదించిన పెరోల్ SIP అలా కాదు. మీ జీతంపై పడే పన్నులన్నీ కట్ అయ్యాక, మీ చేతికి వచ్చే నెట్ శాలరీ (Post-Tax Salary) నుండి ఈ డబ్బులు కట్ అవుతాయి. అంటే, మీరు ఆల్రెడీ టాక్స్ కట్టేసిన డబ్బుల నుంచే ఈ ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుంది. కాబట్టి దీనికి విడిగా ఎలాంటి అదనపు టాక్స్ బెనిఫిట్ ఉండదు.
ELSS ఫండ్స్ ద్వారా టాక్స్ సేవింగ్స్ ఛాన్స్!
పెరోల్ సిప్‌కి విడిగా టాక్స్ బ్రేక్ లేకపోయినా, ఒక చిన్న లూప్‌హోల్ ఉంది. ఒకవేళ మీరు మీ జీతం నుండి కట్ అయ్యే అమౌంట్‌ను నార్మల్ ఫండ్స్ లో కాకుండా ELSS (Tax Saver) మ్యూచువల్ ఫండ్స్ లోకి మళ్లించేలా ఆప్షన్ పెట్టుకుంటే.. అప్పుడు సెక్షన్ 80C కింద ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు టాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఈ బెనిఫిట్ కేవలం పాత టాక్స్ విధానం (Old Tax Regime) లో ఉన్నవాళ్లకే ఎక్కువగా ఉపయోగపడుతుంది.
టాక్స్ కంటే 'డిసిప్లిన్' ముఖ్యం!
టాక్స్ బెనిఫిట్ లేకపోయినప్పటికీ, ఈ పెరోల్ SIP విధానం వల్ల ఉద్యోగులకు చాలా లాభాలు ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.
- నో టెన్షన్: ప్రతి నెలా అకౌంట్లో బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకోవడం, విడిగా బ్యాంక్ మాండేట్ ఇవ్వడం లాంటి తలనొప్పులు ఉండవు.
- మంచి అలవాటు: జీతం అకౌంట్లోకి రాగానే ఖర్చులు అయిపోకముందే ఆటోమేటిక్‌గా పొదుపు అయిపోతుంది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ డిసిప్లిన్ పెరుగుతుంది.
- లాంగ్ టర్మ్ వెల్త్: కొత్తగా జాబ్‌లో చేరిన వారికి, మార్కెట్ గురించి పెద్దగా తెలియని వారికి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అలవాటు చేయడానికి ఇది బెస్ట్ టూల్.
ఈ పెరోల్ సిప్ అనేది టాక్స్ సేవింగ్ ప్రొడక్ట్ కాదు, ఇదొక ఈజీ ఇన్వెస్ట్‌మెంట్ మెథడ్ మాత్రమే. భవిష్యత్తులో ప్రభుత్వం కొత్త టాక్స్ విధానంలో కూడా దీనికి ఏమైనా మినహాయింపులు ఇస్తుందేమో చూడాలి. అప్పటివరకు, టాక్స్ సేవింగ్స్ మాత్రమే కాకుండా.. లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి, మంచి రిటర్న్స్ సాధించడానికి ఇదొక అద్భుతమైన మార్గమని ఇన్వెస్టర్లు గుర్తించాలి.


Click it and Unblock the Notifications