బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోలకు పేపాల్, స్టార్‌బక్స్ సంస్థలు ఓకే
బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీని ఆమోదించే కంపెనీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రధానంగా బిట్ కాయిన్ వైపు చాలా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ చైన్స్, బిగ్ టెక్ ఫర్మ్స్, లీడింగ్ డ్రింకింగ్ కంపెనీలు క్రిప్టోకరెన్సీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. క్రిప్టోకరెన్సీ గత నెలలో ఏకంగా 61వేల డాలర్లను క్రాస్ చేసింది. అయితే ఇటీవల కాస్త క్షీణించి 58వేల డాలర్ల స్థాయిలో కదలాడుతోంది.
ఫిబ్రవరి నెలలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఇంక్ బిట్ కాయిన్‌ను అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్ సీఈవో, ఫౌండర్ జాక్ డోర్సీ ఇందుకోసం జే-జెడ్‌తోను జట్టు కట్టారు. వీరు భారత్, ఆఫ్రికాలో కరెన్సీ డెవలప్‌మెంట్ కోసం 500 బిట్‌కాయిన్స్ ఇన్వెస్ట్ చేశారు. తాజాగా పేపాల్, స్టార్‌బక్స్ సంస్థలు కూడా బిట్ కాయిన్, క్రిప్టోకరెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నాయి.

రెస్టారెంట్ బ్రాండ్ ఇంటర్నేషనల్ బర్గర్ కింగ్‌తో పాటు టిమ్ హోర్టన్, పోపేస్ వంటి సంస్థలు కూడా క్రిప్టోకు అనుకూలంగా ఉన్నాయి. బర్గర్ కింగ్ వెనుజులా కూడా బిట్ కాయిన్, ఇతర కరెన్సీలను యాక్సెప్ట్ చేస్తున్నట్లు చెప్పింది. కేఎఫ్‌సీ, పిజ్జా హట్, టాకో బెల్, ది హాబిట్ బర్గర్ గ్రిల్ వంటివి కూడా క్రిప్టోకు ఓకే చెప్పాయి.


Click it and Unblock the Notifications