మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షలు, నిషేధాల పర్వం కొనసాగుతూనే ఉంది. యుద్ధం ఆరంభించిన తొలిరోజు నుంచే ఆరంభమైన ఆంక్షలు- ఇప్పటికీ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాలను విధించాయి. ఆ దేశ విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని కూడా మూసివేశాయి. ఆర్థిక పరమైన ఆంక్షలను విధించాయి. దిగుమతులను నిషేధించాయి.

భయపడని రష్యా..
అయినప్పటికీ- రష్యా ఏ మాత్రం భయపడట్లేదు. ఆంక్షలకు లొంగట్లేదు. సరికదా- తన యుద్ధాన్ని మరింత ముమ్మరం చేసింది. దాడులను తీవ్రతరం చేసింది. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని పలు నగరాలు రష్యా సైనికుల ఆధీనంలోకి వెళ్లాయి. ప్రత్యేకించి తూర్పు ప్రాంతంలోని నగరాలపై రష్యా సైనిక బలగాలు పట్టు బిగించాయి. రష్యా సైన్యం దాడులను ఉక్రెయిన్ తిప్పి కొడుతోంది. రాజధాని కీవ్‌ను కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది.

ఇటలీ, సింగపూర్..
ఈ పరిణామాల మధ్య- రష్యాపై ఆంక్షలను విధించిన జాబితాలో తాజాగా ఇటలీ, సింగపూర్ కూడా చేరాయి. యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం ఉన్న ఇటలీ- ఇప్పటిదాకా రష్యాపై ఆంక్షలను అమలు చేయలేదు. ఇప్పుడు తాజాగా ఆ దిశగా ఉత్తర్వులను జారీ చేసింది. రష్యన్ ఒలిగార్స్‌కు చెందిన అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్ చేయాలంటూ అన్ని బ్యాంకులకూ ఆదేశాలు వెళ్లాయి. బ్యాంక్ ఆఫ్ ఇటలీ- ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా వారి బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేయాలంటూ ఆదేశించింది.

ఎగుమతులపై సింగపూర్ బ్యాన్
ఉక్రెయిన్‌కు హాని కలిగించడానికి ఉపయోగించే ఆయుధాలతో పాటు సైబర్ కార్యకలాపాల్లో వినియోగించే పరికరాలను ఇక ముందు రష్యాకు సరఫరా చెయ్యబోమని సింగపూర్ స్పష్టం చేసింది. వాటిపై తాత్కాలికంగా నిషేదం విదిస్తున్నామని సింగపూర్ విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. సైనికులు ఉపయోగించే వస్తులు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ జాబితాలోని అన్ని వస్తువులు ఎగుమతి, దిగుమతి చేసుకోవడాన్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నామని సింగపూర్ కస్టమ్స్ అధికారులు తేల్చి చెప్పారు.

పేపాల్ కూడా..
ఇప్పుడు తాజాగా- పేమెంట్స్ సర్వీసెస్ కంపెనీ పేపాల్ కూడా తన సేవలన్నింటినీ రష్యాలో షట్‌డౌన్ చేసింది. తమ కంపెనీ సర్వీసులు ఏవీ కొంతకాలం పాటు రష్యాలో అందుబాటులో ఉండబోవని పేపాల్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడటాన్ని తాము సమర్థించట్లేదని, రష్యాకు వ్యతిరేకంగా నిలిచిన అంతర్జాతీయ సమాజంతో తాము కూడా జత కలిశామని పేపాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డ్యాన్ షుల్మన్ తెలిపారు.

ఉక్రెయిన్ కోసం ఫండ్ రైజింగ్..
రష్యాలో అంతర్జాతీయంగా ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తోన్న ఏకైక పేమెంట్స్ కంపెనీ పేపాల్ ఒక్కటే. ఇప్పటికే ఈ కంపెనీ రష్యాకు చెందిన కొత్త యూజర్లెవరినీ చేర్చుకోలేదు. ఇప్పుడు తాజాగా తన సర్వీసులన్నింటినీ నిలిపివేసింది. పేపాల్ తన సర్వీసులను నిలిపివేయాలంటూ ఇదివరకే ఉక్రెయిన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఫండ్ రైజింగ్ కార్యక్రమాల్లో తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. పేపాల్ కంపెనీ యాజమాన్యం దీనికి సానుకూలంగా స్పందించింది. రష్యా యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచీ 150 మిలియన్ డాలర్ల మేర నిధులను సమీకరించినట్లు తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications