పేమెంట్స్ బ్యాంకులు కుయ్యోమొర్రో...నష్టాలు తడిసిమోపెడు

వివిధ రకాల బ్యాంకింగ్ సేవలు అందించేందుకు అందుబాటులోకి వచ్చిన పేమెంట్స్ బ్యాంకులు ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసుకోవడంలో ఈ బ్యాంకులు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. వీటి నష్టాలు కూడా బాగానే పెరుగుతున్నాయి. డిపాజిట్లు రెండింతలకు పైగా పెరిగినప్పటికీ ఈ బ్యాంకుల నష్టాలు మాత్రం తగ్గడం లేదు.

నష్టాలు ఎంతంటే..

నష్టాలు ఎంతంటే..

* భారత రిజర్వ్ బ్యాంకు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం ఏడూ పేమెంట్స్ బ్యాంకులు చురుగ్గా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

* 2018-19 ఆర్ధిక సంవత్సరంలో వీటి నికర నష్టాలు 626.8 కోట్ల రూపాయలకు పెరిగాయి. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో ఐదు బ్యాంకుల నష్టాలు 515.6 కోట్లుగా ఉన్నాయి.

* 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ఏడూ బ్యాంకుల్లో డిపాజిట్లు 883 కోట్ల రూపాయలకు పెరిగాయి. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో ఐదు బ్యాంకుల్లో డిఫాజిట్లు 438 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

వడ్డీ ఆదాయంలో వృద్ధి

వడ్డీ ఆదాయంలో వృద్ధి

* పేమెంట్స్ బ్యాంకుల నికర వడ్డీ ఆదాయాలు ఆశించిన స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే నిర్వహణ వ్యయాలు పెరగడం వల్ల ఆయా బ్యాంకుల లాభాలు కరిగిపోతున్నాయి.

* ఈ బ్యాంకులు ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోతున్నాయి. కాబట్టి వీటిపై నిర్వహణ వ్యయాల భారం ఎక్కువగా ఉంటోంది. అంతేకాకుండా వీటి కార్యకలాపాలకు కూడా కొన్ని పరిమితులు ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

* ఈ బ్యాంకులు లాభనష్టాలు లేని స్థాయికి చేరుకోవడంతో పాటు లాభాలను నమోదు చేసుకోవడానికి కొంతకాలం పట్టవచ్చని ఆర్బీఐ నివేదిక చెబుతోంది.

* 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ఈ బ్యాంకుల నికర వడ్డీ ఆదాయం 44.8 శాతం పెరిగి 151.5 కోట్ల నుంచి 219.4 కోట్ల రూపాయలకు పెరిగింది.

ఈ బ్యాంకులదే జోరు..

ఈ బ్యాంకులదే జోరు..

2014 సంవత్సరంలో భారత రిజర్వ్ బ్యాంక్... పేమెంట్స్ బ్యాంక్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఆ తరువాత ఈ బ్యాంకులను ఏర్పాటు చేయాలనుకునే కంపెనీలకు లైసెన్సు లను జారీ చేసింది. ఈ బ్యాంకులు మొబైల్ యాప్ ఆధారితంగా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ బ్యాంకులు గరిష్టంగా లక్ష రూపాయల వరకు డిపాజిట్లను అనుమతించవచ్చు. ఈ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అనుమతి లేదు. డెబిట్ కార్డులను జారీ చేయవచ్చు కానీ క్రెడిట్ కార్డులను జారీ చేయరాదు. ఈ బ్యాంకులు సేవింగ్స్, కరెంట్ ఖాతాలను అందిస్తాయి.

తొలుత 11 పేమెంట్ బ్యాంకులకు ఆర్బీఐ లైసెన్సులను జారీ చేసింది. అయితే కొన్ని బ్యాంకులు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందే లైసెన్సులను వద్దనుకున్నాయి. ప్రస్తుతం ఐదు బ్యాంకులు మాత్రమే చురుగా సేవలు అందిస్తున్నాయి. భారతీ ఎయిర్ టెల్ మొదట పేమెంట్స్ బ్యాంకు సేవలను ప్రారంభించింది. ఆదిత్య బిర్లా కంపెనీ ఈ ఏడాది జులై నుంచి తన సేవలను నిలిపి వేసింది.

ప్రస్తుతం ఈ క్రింది ర్యాంకులు చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అవేమిటంటే..

- ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్

- ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్

- జియో పేమెంట్స్ బ్యాంక్

- పేటీఎం పేమెంట్స్ బ్యాంక్

- ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంక్

- ఫినో పేమెంట్స్ బ్యాంక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+