Paytm Stock: కరోనా తర్వాత భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అత్యధికంగా రిటైల్ పెట్టుబడిదారుల నుంచి ఆదరణను పొందుతున్నాయి. ఈ క్రమంలో చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో మ్యూచువల్ ఫండ్ ఇన్‌ఫ్లో లు కొనసాగుతున్నాయి. అయితే దీనిని మరింతగా ముందుకు తీసుకెళ్లటానికి డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో జతకట్టడం గమనార్హం.
చిన్న నెలవారీ క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్న ఇన్వెస్టర్ల సౌలభ్యం కోసం తాజాగా పేమెంట్స్ దిగ్గజం పేటీఎం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీతో జతకట్టింది. రెండు సంయుక్తంగా చిన్న ఇన్వెస్టర్ల కోసం రూ.250 SIP మ్యూచువల్ ఫండ్ పథకమైన జన్‌నివేష్ లాంచ్ చేశాయి. ఇది మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకట్టుకోవటానికి దోహదపడుతుందని రెండు సంస్థలు భావిస్తున్నాయి. ఈ ప్రకటన బయటకు రావటంతో ఈక్విటీ మార్కెట్లలో పేటీఎం స్టాక్ ధర 1 శాతానికి పైగా లాభపడింది.

మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో 1.93 శాతం క్షీణతతో రూ.718.55 వద్ద ఎన్ఎస్ఈలో కొనసాగుతున్నాయి. అయితే ఉదయం స్టాక్ ధర రూ.742 వద్ద ట్రేడింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. గడచిన ఏడాది కాలంగా పేటీఎం కంపెనీ షేర్లు ఏకంగా 115 శాతం పెరుగుదలను చూడగా.. 2025 ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకుల కారణంగా దాదాపు 25 శాతం క్షీణతను నమోదు చేసింది.
భారతదేశంలో సామాన్య ప్రజలకు సైతం మ్యూచువల్ పెట్టుబడులను చేరువచేటం కోసం భారత ప్రభుత్వం తీసుకొస్తున్న వికసిత్ భారత్ కింద ప్రజలు తమ భవిష్యత్తు కోసం పెట్టుబడులను కొనసాగించటానికి పేటీఎం జన్ నివేష్ రూ.250 SIPని తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ చొరవను సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరి బుచ్, SBI చైర్మన్ శెట్టి ఈరోజు ప్రారంభించారు. దీని కింద పెట్టుబడిదారులు ఇకపై కేవలం రూ.250 కనీస పెట్టుబడితో తమ సిప్ ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించటానికి వీలు కల్పిస్తూ ప్రజలకు ఆర్థిక వృద్ధిని సాధించటంలో సహాయపడుతుందని పేటీఎం పేర్కొంది.
కొత్తగా తీసుకొచ్చిన జన్ నివేష్ స్కీమ్ పై పేటీఎం సీఈవో, వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దేశంలోని కోటి మంది పెట్టుబడిదారులకు ప్రస్తుతం చేరువకావాలని పేమెంట్స్ దిగ్గజం పేటీఎం పేర్కొంది. భవిష్యత్తులో వీరి సంఖ్య దాదాపు 4 కోట్లకు చేరుకోవచ్చని ఆయన తన అంచనాలను పేర్కొన్నారు. తమ ప్రస్తుత స్కీమ్ లక్షల మంది భారతీయులకు తక్కువ మెుత్తంతో పెట్టుబడి మార్గాలను అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications