For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

NRI News: విదేశాల్లోని భారతీయులకు శుభవార్త.. మీ వారికి డబ్బు ఇలా సులభంగా పంపించుకోండి.. తక్కువ ఖర్చులో

|

NRI Payments: దేశంలో డిజిటల్ చెల్లింపుల వెన్నెముకను నిర్మించిన కంపెనీ దేశంలోని 32 మిలియన్ల ప్రవాసులు తమ డబ్బును ఇంటికి తీసుకురావడానికి చౌకగా, సులభతరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత ఏడాది విదేశాల్లోని భారతీయులు 87 బిలియన్ డాలర్లను మన దేశంలోని వారి కుటుంబ సభ్యులకు పంపించారు. ఇది దేశంలోకి జరిగిన అతిపెద్ద ఇన్‌ఫ్లో అని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.

ప్రస్తుతం రెమిటెన్స్ మార్కెట్లో.. ఒక దేశం నుంచి మరో దేశానికి 200 డాలర్లను పంపడానికి యావరేజ్ గా 13 డాలర్ల వరకు ఖర్చువుతోందని NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రితేష్ శుక్లా తెలిపారు. ఈ మార్కెట్లో మంచి అవకాశం ఉందని ఆయన తెలిపారు.

భారతీయుల కోసం..

భారతీయుల కోసం..

"మేము భారతదేశంలో నగదును పెద్ద ఎత్తున ట్రాన్ఫర్ చేశాము. ఇప్పుడు సరిహద్దు కారిడార్‌లలో ఇదే విధంగా విజయాన్ని పునరావృతం చేయాలని చూస్తున్నాము" అని శుక్లా చెప్పారు. విదేశాల్లోని భారతీయులు మా ఛానల్ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బును నేరుగా పంపవచ్చు, భారతీయులు తరచుగా ప్రయాణించే మార్కెట్‌ల కోసం, మేము మా సాధనాల యాక్సెప్టెన్సీని పెంచుతాము." అని రితేష్ శుక్లా తెలిపారు.

 SWIFT విధానానికి పత్యామ్నాయంగా..

SWIFT విధానానికి పత్యామ్నాయంగా..

NPCI ద్వారా విజయవంతమైన విదేశీ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని, బెల్జియం ఆధారిత క్రాస్-బోర్డర్ చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్ అయిన SWIFTకి భారత్‌కు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. అయితే ప్రస్తుత ప్లాట్‌ఫారమ్‌లను టార్గెట్ చేయడం తమ లక్ష్యం కాదని శుక్లా స్పష్టం చేశారు. దాదాపు 330 బ్యాంకులు, 25 యాప్‌లు ఏకీకృత చెల్లింపు ఇంటర్‌ఫేస్‌ను భాగస్వామ్యం చేస్తాయి. వీటిలో Google Pay, WhatsApp pay వంటి దిగ్గజ కంపెనీలు సైతం ఉన్నాయి. ఇది భారతదేశంలో తక్షణ డిజిటల్ లావాదేవీలను 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌గా మార్చడంలో సహాయపడింది.

లావాదేవీల ఖర్చును తగ్గించేందుకు..

లావాదేవీల ఖర్చును తగ్గించేందుకు..

NPCI దాని దేశీయ విజయాన్ని ప్రతిబింబించడానికి UPI ప్లాట్‌ఫారమ్‌ను ఇతర దేశాలలోని సిస్టమ్‌లకు కనెక్ట్ చేసే ప్రక్రియలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, ఫిన్‌టెక్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్‌లతో ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయి. లావాదేవీ ఖర్చులను తగ్గించడం, మరింత చిన్న-టికెట్ లావాదేవీలను ప్రారంభించడం తమ లక్ష్యమని శుక్లా చెప్పారు. విదేశీ దేశాలతో UPI అనుసంధానం దేశాల మధ్య వాణిజ్యం, ప్రయాణం, రెమిటెన్స్ ప్రవాహాలను మరింతగా పెంచుతూ ఖర్చు తగ్గిస్తుందని రిజర్వు బ్యాంక్ సైతం ఒక నివేదికలో పేర్కొంది.

English summary

NRI News: విదేశాల్లోని భారతీయులకు శుభవార్త.. మీ వారికి డబ్బు ఇలా సులభంగా పంపించుకోండి.. తక్కువ ఖర్చులో | Payment giant has SWIFT alternative for 32 million Indian NRI's know details

indias NPCI creating SWIFT alternative for tranfering money digitally by indians in other countries for lower transaction charges..
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X