Layoff News: 2500 మందిని ఇంటికి పంపుతున్న పేమెంట్స్ కంపెనీ.. మరో కంపెనీలో 12000 మంది..
PayPal Layoffs: పరిస్థితులు చక్కబడుతున్న కొద్ది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చాలా మంది భావిస్తుంటే దానికి భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయి.
పేమెంట్స్ దిగ్గజాల్లో ఒకటైన పేపాల్ సంస్థ తమ మెుత్తం ఉద్యోగుల్లో 9 శాతం అంటే 2,500 మందిని ప్రపంచ వ్యాప్తంగా తొలగించాలని నిర్ణయించింది. 2024 ప్రారంభంలో సీఈవో అలెక్స్ క్రిస్ ఉద్యోగులకు పంపిన మెయిల్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. కొత్తగా బాధ్యతలు చేపట్టగానే ఖర్చుల తగ్గింపుపై ఫోకస్ చేసిన సీఈవో రానున్న వారంలో తొలగింపులకు గురయ్యే ఉద్యోగులకు సమాచారం అందుతుందని పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీలుగా పేరున్న సంస్థలు సైతం వేల సంఖ్యలో నూతన ఏడాది లేఆఫ్స్ ప్రకటిస్తూ భయాలను పెంచేస్తున్నాయి. వ్యాపారాన్ని రీసైజ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదే క్రమంలో యునైటెడ్ పార్సెల్ సర్వీసెస్ సంస్థ సైతం ఉద్యోగుల కోతలను ప్రకటించింది. ఈ క్రమంలో దాదాపు 12,000 మంది ఉద్యోగులను లేఆఫ్స్ ద్వారా తొలగించాలని నిర్ణయించింది. సాఫ్ట్ డిమాండ్, అధిక యూనియన్ లేబర్ ఖర్చులను భర్తీ చేయడానికి సీఈవో కరోల్ టోమ్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా UPS తన కొయెట్ ట్రక్ బ్రోకరేజ్ వ్యాపారాన్ని విక్రయించడాన్ని అన్వేషిస్తోందని వెల్లడైంది. ఈ వార్తల నేపథ్యంలో యూపీఎస్ స్టాక్ అమెరికా మార్కెట్ల ప్రారంభంలో 7.6 శాతం మేర పడిపోయింది. కంపెనీ యూరప్ వ్యాపారం మందగించటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
త్రైమాసిక ఫలితాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు వెలువరిస్తున్న వేళ ఆదాయాల అంచనాలు, వస్తున్న లాభాల మార్జిన్లను పరిశీలనలోకి తీసుకుని అనేక కంపెనీలు ఉద్యోగుల తొలగింపులతో తమ వ్యాపారాల రీస్ట్రక్చరింగ్ కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహిస్తున్నాయి.


Click it and Unblock the Notifications