PFRDA, NPS ఖాతాదారులకు మరో సౌలభ్యం కల్పించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా మీ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఖాతాకు డబ్బులు చెల్లించవచ్చని పేర్కొంది. ఖాతాదారుల సౌకర్యర్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం IMPS, NEFT, RTGS వంటి ఇతర ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాధ్యమాలను ఉపయోగించి చెల్లింపులు చేసేవారు.

యూపీఐ హ్యాండిల్
ఇందుకోసం యూపీఐ హ్యాండిల్ (PFRDA.15digitVirtualAccount@axisbank)ను కొత్తగా ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డీ-రెమిట్ వర్చువల్ అకౌంట్, అనుబంధిత శాశ్వత ఖాతా సంఖ్య (PRAN)కి భిన్నంగా ఉంటుందని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. ఇది 6001 లేదా 6002 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది. అలాగే, టైర్ I & II ఖాతాలకి కూడా డీ-రెమిట్ వర్చువల్ ఖాతా సంఖ్య వేరు వేరుగా ఉంటుందని తెలిపింది.

D-Remit
D-Remit కింద ఉదంయో 09:30 AM లోపు ట్రస్టీ బ్యాంక్ (TB) ద్వారా స్వీకరించిన విరాళాలు అదే రోజు పెట్టుబడి కోసం పరిగణిస్తారని PFRDA వివరించింది. 09:30 AM తర్వాత వచ్చిన డిపాజిట్లు మార్గదర్శకాల ప్రకారం తదుపరి పెట్టుబడి రోజున పెట్టుబడి కోసం పరిగణిస్తామని చెప్పింది. పెన్షన్ రెగ్యులేటర్ డి-రెమిట్ కింద కంట్రిబ్యూషన్ కనీస విలువ రూ.500 లుగా నిర్ణయించింది.

UPI హ్యాండిల్ ద్వారా సబ్‌స్క్రైబర్ వర్చువల్ ఖాతా నంబర్‌ను ఎలా తెలుసుకోవాలంటే..
దశ 1 - CRA సిస్టమ్‌లో eNPS వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
దశ 2 - PRANని ధృవీకరించడానికి వివరాలను అందించాలి.
దశ 3 - మొబైల్ నంబర్/ఇమెయిల్ ID ద్వారా అందుకున్న OTPని నమోదు చేయాలి.
దశ 4 - వర్చువల్ ఖాతాను సృష్టించాల్సిన ఖాతా-టైర్ I లేదా IIని ఎంచుకోవాలి.
దశ 5 - చదివి మీ సమ్మతిని తెలియజేయండి.
దశ 6 - 'వర్చువల్ ఖాతాను రూపొందించు'పై క్లిక్ చేసి తర్వాత, ఆపై అభ్యర్థన ట్రస్టీ బ్యాంక్‌కు ఫార్వార్డ్ అవుతుంది.
దశ 7 - UPI హ్యాండిల్‌లో, PRANకి నిధులను పంపడం కోసం, 'PFRDA.15digitVirtualAccount@axisbank' ఫార్మాట్‌లో 15-అంకెల వర్చువల్ ఖాతా నంబర్‌ను నమోదు చేయాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications