ఇండీడ్ సంస్థ తాజాగా నిర్వహించిన పే మ్యాప్ (PayMap) సర్వేలో తెలిసిన ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, భారతదేశంలో ఉద్యోగుల జీతాల పరంగా అభివృద్ధి చెందుతున్న నగరాలే ఇప్పుడు కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నాయి. ఈ సర్వేలో భాగంగా, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాలు ఉద్యోగులకు మెరుగైన వేతన అవకాశాలు కల్పిస్తున్నాయని స్పష్టమైంది. గతంలో జీతాల పరంగా ఆధిపత్యం చెలాయించిన బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో నగరాలను ఈ అభివృద్ధి చెందుతున్న నగరాలు అధిగమిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా చూస్తే, ఉద్యోగుల జీతాల్లో సగటుగా 15% పెరుగుదల నమోదైందని నివేదిక తెలియజేస్తోంది. ప్రారంభ స్థాయి ఉద్యోగుల విషయానికి వస్తే, చెన్నై నగరంలో 0-2 ఏళ్ల అనుభవం ఉన్న వారు నెలకు సగటున రూ. 30,100 సంపాదిస్తున్నారు. అదే సమయంలో, హైదరాబాద్ లో 5-8 ఏళ్ల అనుభవం గల మధ్య, సీనియర్ ఉద్యోగులు నెలకు రూ. 69,700 వరకు సంపాదిస్తున్నారని పే మ్యాప్ వెల్లడించింది.
అయితే, తక్కువ జీతం అనేది ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది. 69% మంది ఉద్యోగులు తమ నగరాల్లో జీతం తగినంతగా పెరగడం లేదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ (96%), ముంబయి (95%), పుణె (94%), బెంగళూరు (93%) వంటి ఖరీదైన నగరాల్లో ఈ అసమతుల్యత స్పష్టంగా కనిపిస్తోంది. సర్వేలో పాల్గొన్న ఉద్యోగులలో చాలా మంది తమ నగరాల్లో జీవన వ్యయానికి తగినంత జీతం అందడం లేదని భావిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండటంతో, ఉద్యోగులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో జీవన వ్యయం తక్కువగా ఉండటంతో, అక్కడ ఉద్యోగులు తమ జీతంతో సంతృప్తిగా ఉన్నారు.
ఇంకా, ఉద్యోగులు నగరాలు మారడాన్ని పెద్దగా ఇష్టపడటం లేదు. వారి అభిప్రాయం ప్రకారం, నగరం మారితే కొత్త ఖర్చులు, కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు, మరియు కొత్త జీవనశైలికి అలవాటు పడాల్సిన అవసరం వంటి అంశాలు ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ సర్వే ద్వారా, భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు, వేతనాలు, జీవన వ్యయం మధ్య ఉన్న సంబంధం కొత్త దిశగా మారుతుందని, అభివృద్ధి చెందుతున్న నగరాలు భవిష్యత్తులో ఉద్యోగుల కోసం ప్రధాన కేంద్రాలుగా మారే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం భారతదేశంలో జీతాల పరంగా ఐటీ/ఐటీఈయస్(ITES) రంగం అన్నింటికన్నా ముందుంది. అన్ని లెవల్స్‌లోనూ ఫ్రెషర్స్ నుంచి సీనియర్ ప్రొఫెషనల్స్ వరకు ఈ రంగంలో మంచి ఆదాయం లభిస్తోంది. ఇక మ్యానుఫాక్చరింగ్ మరియు టెలికాం రంగాలు కూడా వెనుక పడకుండా, ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు రూ.28,100 నుండి, అనుభవం ఉన్నవారికి రూ.68,200 వరకు జీతాలు అందిస్తున్నాయి. ఒకవైపు, ఫ్రెషర్స్‌కి (సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, హెచ్ఆర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లాంటి రోల్స్‌కి) సగటున రూ.25,000 నుండి రూ.30,500 మధ్య జీతాలు వస్తుండగా, మరోవైపు ప్రోడక్ట్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 5-8 ఏళ్ల అనుభవం ఉన్నవారు రూ.85,500 వరకు సంపాదించే అవకాశముంది. అంతేకాక, UI/UX డిజైనర్లు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలపర్లతో సమాన స్థాయిలో ఆదరణ పొందుతున్నారు. ఈ రంగంలో సీనియర్ లెవల్స్‌లో జీతాలు సుమారుగా రూ.65,000 వరకు ఉండే అవకాశముంది. ఈ డేటా చూస్తే, ప్రస్తుతానికి టెక్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, డిజైన్ రంగాల్లో పని చేసే వారికి మంచి జీతాలు, స్థిరమైన అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.
ఇప్పుడు చాలా మంది యువ ఉద్యోగులు తమ కెరీర్ అభివృద్ధి కోసం, అలాగే జీవన ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలను ఎంచుకుంటున్నారు. ఇది వారికి ప్రొఫెషనల్ గ్రోత్‌తో పాటు వ్యక్తిగత జీవితం మెరుగుపడేలా సహాయపడుతోంది. చిన్న నగరాల్లో పని చేయడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తోంది. ట్రాఫిక్ తక్కువగా ఉండటం, డైలీ ఉద్యోగులు పనితో పాటు పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. జీతాలు పెరగడంతో స్థానికంగా ఖర్చులు పెరిగి, చిన్న వ్యాపారాలు, సేవల రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల ఆ నగరాల ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం పడుతోంది. ఇక మంచి జీతంతో, ఉద్యోగులు తమ పిల్లలకు ఉత్తమ విద్య, కుటుంబానికి మంచి ఆరోగ్య సదుపాయాలు కల్పించ గలుగుతున్నారు. దీని ద్వారా వారి లైఫ్ స్టాండర్డ్ కూడా మెల్లగా మెరుగవుతోంది.
More From GoodReturns

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications