ఇప్పుడు కొత్త బిజినెస్ సోషల్ మీడియాలో మొదలైంది. ఇప్పటికే ప్రపంచంలో చాలామంది తెలివిగా డబ్బును సంపాదిస్తున్నారు. జపాన్‌లో రద్దీగా ఉండే మెట్రో రైళ్లలో ప్రయాణికులను లోపలికి తోసే ఉద్యోగం చేసే వారు ఉన్నారు. అలాగే చైనాలో ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి సహచరులను అద్దెకు తీసుకునే సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ కొందరు నిద్రలో తోడుగా ఎవరో పక్కన పడుకోవడానికి కూడా డబ్బు చెల్లిస్తారు. కానీ భారతదేశంలో అలాంటి వృత్తులు అరుదుగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఒక యువతి ఆ శూన్యాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో @storyteller_emma అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఎమ్మా అనే యువతి.. Instagrammer లో ప్రజల బాధలను వినడానికి డబ్బులు తీసుకుని వ్యాపారాన్ని ప్రకటించింది. ఆమె వీడియోలో చెప్పిన వివరాల ప్రకారం.. చిన్న చిన్న ఫిర్యాదులు చెబితే రూ.200, పెద్ద సమస్యలకు రూ.400, మరింత భావోద్వేగపూరితంగా, కన్నీళ్లతో కూడిన సెషన్ అయితే రూ.1000. ఇలా రేట్లు ఫిక్స్ చేసింది. నీ బాధల్లో నేను నీతోనే ఉన్నాను. ఏ బాధ అయినా చెప్పు, నేను వింటాను. నువ్వు ఒంటరివి కాదు. కానీ డబ్బు సిద్ధంగా ఉంచుకో అని ఎమ్మా ఆ వీడియోలో చెబుతోంది.

ఈ వీడియోను ఆమె హాస్యం, ఫన్నీ కంటెంట్, కామెడీ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్ట్ చేసింది.అయితే ఇది కేవలం వినోదం కోసం చేసిన ప్రయత్నమని స్పష్టంగా ఉంది. అయినప్పటికీ, ఈ ఆలోచన చాలా మందికి ఆసక్తికరంగా అనిపించి అది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ప్రస్తుతం ఆ క్లిప్‌కు 21 లక్షల వ్యూస్, 26 వేల లైక్స్, 91 వేల షేర్లు, అలాగే 5 వేలకు పైగా వ్యాఖ్యలు వచ్చాయి. సోషల్ మీడియాలో వినియోగదారులు ఈ వీడియోపై ఫన్నీగా స్పందిస్తున్నారు.
ఒక వినియోగదారు హిమానీ రాజ్‌పుత్ కామెంట్ చేస్తూ..నేను చాలా కాలంగా ఇదే పని చేస్తున్నాను, అది కూడా ఉచితంగా అని సరదాగా రాశారు. మరొకరు ఈ వీడియో చూసాక నా బాధలు పోయాయి. మళ్ళీ మళ్ళీ చూస్తే నవ్వు వస్తోందని ప్రశంసించారు.మరొక యూజర్ ప్రీతి రాథోడ్..నెలవారీ సబ్‌స్క్రిప్షన్ మోడల్ చేస్తే ఇంకా బావుంటుందని సూచించారు. అనుష్క అనే వ్యాఖ్యాత నేను ఈ బిజినెస్ నడిపితే కోటీశ్వరురాలిని అవుతానని సరదాగా రాశారు.మరొక నెటిజన్ QR కోడ్ పంపు సోదరి, నా చిన్న బాధకు రూ.200 పంపాలని ఎమ్మాను అభ్యర్థించారు.
ఈ మొత్తం వ్యవహారం హాస్యప్రధానంగానే ఉన్నప్పటికీ ఆధునిక జీవనశైలిలో, ఒంటరితనం, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి. మనసులోని బాధలను ఎవరో ఒకరితో పంచుకోవాలని అనుకునే వాళ్లకు ఇలాంటి లిసనింగ్ సర్వీసులు ఆకర్షణీయంగా కనిపించేలా ఉన్నాయి. ముందు ముందు ఇవన్నీ మంచి వ్యాపారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications