Patanjali News: బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతాంజలి ఫుడ్స్ దేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విక్రయ సంస్థగా కొనసాగుతోంది. అయితే కంపెనీ తప్పుడు ప్రకటనలపై ఇటీవల సుప్రీం కోర్టు మెుట్టికాయలు వేసింది. బాబా రామ్‌దేవ్ క్షమాపణను కోర్టు తిరస్కరిస్తూ.. రాబోయే వాయిదాకు సైతం ప్రత్యక్షంగా హాజరుకావాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
ఇలాంటి సమయంలో కంపెనీలో విదేశీ ఇన్వెస్టర్ల కోలాహలం కొనసాగుతోంది. మంగళవారం మార్కెట్లు ముగిసే సమయానికి పతాంజలి స్టాక్ ర్యాలీని నమోదు చేసింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లలో దాదాపు 7% పెరుగుదల కనిపించింది. ఇంట్రాడేలో రూ.1,424.10కి చేరాయి. ఈ షేర్ల పెరుగుదల వెనుక ఓ శుభవార్త ఉంది. నిజానికి గతంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పతనానికి గురైనప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడి సంస్థ GQG పార్టనర్స్ మార్చి త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్‌లో తన వాటాలను పెంచుకుంది.

GQG పార్టనర్స్ మార్చి 2024 త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్‌లో తన వాటాను 11.48%కి పెంచుకుంది. దీనికి ముందు డిసెంబర్ 2023 త్రైమాసికంలో పతాంజలిలో వాటా 3.3%గా ఉంది. బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని ఎఫ్‌ఎంసీజీ సంస్థ షేర్లు బీఎస్ఈలో క్రితం ముగింపు రూ.1,335.50 నుంచి మంగళవారం 6.62% పెరిగి రూ.1,424.10 స్థాయికి చేరుకున్నాయి. అయితే ట్రేడింగ్ ముగింపు నాటికి బీఎస్ఈలో కంపెనీ షేర్ల ధర 5.41% లాభపడి రూ.1,407.70 వద్ద స్థిరపడింది.
పతంజలి ఫుడ్స్ షేర్లు పనితీరును కనబరిస్తే ఒక్క ఏడాదిలో 45% ర్యాలీతో ఇన్వెస్టర్లను సంపన్నులుగా మార్చేసింది. అలాగే గత ఆరు నెలల్లో ఈ షేరు 6.57 శాతం లాభపడింది. 2024 ప్రారంభం నుంచి గమనిస్తే స్టాక్ దాదాపు 10.40% క్షీణతను కలిగి ఉంది. గత ట్రేడింగ్ డే ముగింపు సమయానికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.50,856 కోట్లకు పెరిగింది. అయితే కంపెనీ న్యాయపరంగా ఎదుర్కొంటున్న కొన్ని చిక్కుల కారణంగా గత కొంత కాలంగా ఇన్వెస్టర్లలో వెంటాడుతున్న భయాలు స్టాక్ పతనానికి దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం విదేశీ ఇన్వెస్టర్ల రాకతో మంచి కంపెనీ షేర్లకు మంచి రోజులు వస్తున్నట్లు కనిపిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications