Patanjali Foods: బాబారామ్ దేవ్ కంపెనీ పతంజలి ఫుడ్స్ వేగంగా తన వ్యాపారాలను విస్తరించాలని చూస్తోంది. అయితే ఇప్పటికే రామ్‌దేవ్ కంపెనీలు తప్పుడు ప్రకటన చిక్కుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరో పక్క జీఎస్టీ నోటీసులు సైతం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఈ క్రమంలో పతంజలి ఫుడ్స్ తన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. పతంజలి ఫుడ్స్ లిమిటెడ్.. ప్రధానంగా ఎడిబుల్ ఆయిల్ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. అయితే ప్రమోటర్ గ్రూప్ పతంజలి ఆయుర్వేద ఆహారేతర ఉత్పత్తుల వ్యాపారాన్ని కొనుగోలు చేసే ప్రతిపాదనను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అయితే డెంటల్ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్ కేటగిరీలలో ఉత్పత్తులను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తామని వర్గాలు తెలిపాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు.

బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని ప్రమోటర్ గ్రూప్ మొత్తం టర్నోవర్‌లో ఈ ఉత్పత్తులు 50-60 శాతం వాటా కలిగి ఉన్నాయి. నాన్-ఫుడ్ బిజినెస్ వెంచర్ విక్రయానికి సంబంధించి పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ నుంచి అందిన ప్రాథమిక ప్రతిపాదనపై తమ డైరెక్టర్ల బోర్డు చర్చించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పతంజలి ఫుడ్స్ తెలిపింది. పతంజలి ఆయుర్వేద్‌కి చెందిన నాన్-ఫుడ్ పోర్ట్‌ఫోలియోతో సినర్జీని మెరుగుపరచడానికి అత్యంత సమర్థవంతమైన మార్గాన్ని అంచనా వేయడానికి డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని కంపెనీ తెలిపింది. అయితే దీనికి సంబంధించిన షరతులపై చర్చలు జరుగుతున్నాయని, తదుపరి పరిశీలన కోసం ఆడిట్ కమిటీకి కనుగొన్న వాటిని నివేదించడానికి అధికారం ఇచ్చారు.
పతంజలి ఫుడ్స్ తన ఉత్పత్తులను బలోపేతం చేయడానికి మే 2021లో పతంజలి నేచురల్ బిస్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిస్కెట్ల వ్యాపారాన్ని రూ.60.03 కోట్లకు కొనుగోలు చేసింది. దీని తర్వాత జూన్ 2021లో రూ.3.50 కోట్లకు నూడుల్స్ & అల్పాహార తృణధాన్యాల వ్యాపారాన్ని.. మే 2022లో పతంజలి ఆయుర్వేద నుంచి రూ.690 కోట్లకు ఆహార వ్యాపారాన్ని కూడా కొనుగోలు చేసింది. పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ గతంలో రుచి సోయా ఇండస్ట్రీస్ పేరుతో వ్యాపారాన్ని కొనసాగించింది. ఇది 1986లో స్థాపించబడింది.


Click it and Unblock the Notifications