యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశించబోతున్నారు. పతంజలి ఆయుర్వేద అండ్ రజనిగంధ బాండ్స్ నడుపుతున్న ఆయన నేతృత్వంలోని ధరంపాల్ సత్యపాల్ గ్రూప్ (DS గ్రూప్) సనోతి ప్రాపర్టీస్ LLP నుండి మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనుంది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ కొనుగోలు రూ.4,500 కోట్లకి జరిగింది. ఈ కొనుగోలు డీల్ గురించి కంపెనీ గురువారం స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ అదార్ పూనవాలా అండ్ రైజింగ్ సన్ హోల్డింగ్స్ యాజమాన్యంలో ఉంది.

పతంజలి ఆయుర్వేద & DS గ్రూప్‌తో వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం, సనోటి ప్రాపర్టీస్ ఇన్సూరెన్స్ అనుబంధ సంస్థ మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ (గతంలో మాగ్మా HDI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ)ను సెలికా డెవలపర్స్ & జాగ్వార్ అడ్వైజరీ సర్వీసెస్‌కు విక్రయించడానికి ఆమోదం తెలిపిందని కంపెనీ ప్రకటనలో తెలిపింది. రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి రూ.4,500 కోట్లకి ఈ ఒప్పందం జరిగిందని కంపెనీ తెలిపింది.
కంపెనీ ఎం చేస్తుంటుంది: మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ వివిధ క్యాటగిరిలో 70కి పైగా జనరల్ ఇన్సూరెన్స్ రంగంలోని పూర్తి హెల్త్ కవరేజ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఈ కంపెనీ కస్టమర్లకు వెహికిల్, హెల్త్, పర్సనల్ ఆక్సిడెంట్, హౌస్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. కంపెనీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ లో ఫైర్, ఇంజనీరింగ్, మెరైన్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. సనోటి ప్రాపర్టీస్‌లో పూనావాలాకు 90% వాటా ఉండటంతో పూనావాలా తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకంగా పరిగణిస్తుంది.
పతంజలి ఆయుర్వేద ప్రతినిధి మాట్లాడుతూ, ఈ రంగం 100 శాతం ఎఫ్‌డిఐకి అవకాశం కల్పించడంతో సహా రెగ్యులేటరీ సంస్కరణల ద్వారా ముందుకు సాగుతోందని అన్నారు. భారతదేశంలో జనరల్ ఇన్సూరెన్స్ అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా తక్కువ. పతంజలి ఆయుర్వేద భారీ నెట్‌వర్క్ నుండి మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందుతుంది. కంపెనీ ఉత్పత్తులు 2,00,000 షాపుల్లో అలాగే రిలయన్స్ రిటైల్, హైపర్ సిటీ, స్టార్ బజార్ ఇంకా 250 పతంజలి మెగా స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
అయితే 1,500 కోట్ల పెట్టుబడితో నాగ్‌పూర్‌లో నిర్మించిన మెగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లో తాజాగా కార్యకలాపాలు ప్రారంభించినట్లు పతంజలి ఆయుర్వేద్ ప్రకటించింది. నాగ్‌పూర్‌లోని మిహాన్‌లో పతంజలి మెగా ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ మార్చి 9న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే యోగా గురువు రామ్‌దేవ్ సమక్షంలో ప్రారంభించారు. ఈ కేంద్రంలో రోజుకు 800 టన్నుల సామర్థ్యంతో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications