Venu Swamy: వేణు స్వామి చెప్పిందే నిజమైందా.. పవన్ నాలుగో పెళ్లి చేసుకుంటారా..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల విడాకులు తీసుకుంటున్నట్లు సంయుక్తంగా ప్రకటించారు. పరస్పర అవగాహన, గౌరవంతోనే తాము విడిపోవాలని ఉమ్మడిగా నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. వివాహ బంధం ముగిసినప్పటికీ తాము మంచి స్నేహితులుగా కొనసాగుతామని పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవా తమ శ్రేయోభిలాషులు, సన్నిహితులకు స్పష్టం చేశారు. తమ పిల్లల భవిష్యత్తు, మానసిక ప్రశాంతతకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా పిల్లల పెంపకం, ఎదుగుదల విషయంలో తమ ఉమ్మడి బాధ్యతలను ఎప్పటికీ నెరవేరుస్తామని వివరించారు.

అయితే వీరి విడాకులకు సంబంధించి గతంలో వేణు స్వామి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో అయిన పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా దంపతుల విడాకులు తీసుకుంటారని ఆయన చెప్పారు. పవన్ విడాకులు, నాలుగో పెళ్లిపై మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రెండేళ్ల క్రితం ఒక ఛానెల్ లో మాట్లాడుతూ పవన్ 2026లో విడాకులు తీసుకుంటారని పేర్కొన్నారు. మీరెలా చెబుతున్నారని.. అని జర్నలిస్టు ప్రశ్నించగా జ్యోతిష్యం ఆధారంగా చెబుతున్నానని వివరించారు.

Venu Swamy

ఆయన వ్యాఖ్యలను రిపోర్టర్ ఖండించినా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు వేణు స్వామి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుంటారని.. నాలుగో పెళ్లి చేసుకుంటారని ఆ ఇంటర్వ్యూలో వేణు స్వామి చెప్పారు. ఇప్పుడు విడాకుల మాట నిజం అవ్వటంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేణు స్వామి వ్యాఖ్యలు జత చేస్తూ పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. గతంలో అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహ బంధంలో సమస్యలు వచ్చి విడిపోతారని ఆయన ముందే చెప్పిన మాటలు నిజమవ్వడం టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే పవన్ కల్యాణ్, అన్నా లెజ్నోవా కూడా విడిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా వివాహం 2013 డిసెంబరులో జరిగింది. 2011లో విడుదలైన తీన్ మార్ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పవన్ కల్యాణ్ గతంలో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. 1997లో నందినిని వివాహం పెళ్లి చేసుకున్నారు. 2008లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2009లో నటి రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+