complaints on airindia: ఈమధ్య ఎయిర్‌ఇండియాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రభుత్వం నుంచి టాటాల చేతిలోకి వెళ్లగా.. ఎయిర్‌లైన్స్‌కు మంచిరోజులు వచ్చాయని అందరూ భావించారు. అయితే ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తుండటం పట్ల ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలకోట్లు పెట్టి కొనుగోలు చేసినా, కనీస సౌకర్యాల కల్పనలో ఇప్పటికీ వెనుకంజలోనే ఉన్నట్లు పెదవి విరుస్తున్నారు.
న్యూఢిల్లీ నుంచి అమెరికాలోని పలు ప్రాంతాలకు వినీత్ అనే ఇన్వెస్టర్ తరచూ ఎమిరేట్స్ విమానాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. అక్కడికి నేరుగా ఫ్లైట్ ఉండటంతో ఎయిర్ ఇండియాను ఎంచుకున్నట్లు చెప్పారు. అయితే ఇటీవల బిజినెస్ క్లాస్‌లో తన దారుణమైన ప్రయాణ అనుభవాన్ని X వేదికగా పంచుకున్నారు. పూర్తిగా నిరాశ చెందినట్లు చెప్పారు. తరువాత పోస్టును ఎయిర్ ఇండియా డిలీట్ చేయడంపైనా ప్రశ్నించారు. కాగా మరొక వినియోగదారు సైతం ఆహారంలో బ్లేడ్ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆహారాన్ని పిల్లలు తింటే, ఒకవేళ తాను గమనించకపోతే తన నాలుక పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు.

విమానం 25 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమై నిరాశను పెంచినట్లు వినీత్ చెప్పుకొచ్చారు. బిజినెస్ క్లాస్ సీట్లు అపరిశుభ్రంగా, అరిగిపోయి ఉన్నట్లు వెల్లడించారు. నిద్రపోయేందుకుగాను వెనక్కు వాల్చగా పనిచేయలేదని ఫిర్యాదు చేయడంతో మరోసీటుకు మారాల్సి వచ్చినట్లు తెలిపారు. 35లో కనీసం 5 సీట్లు కూడా సరిగా లేవన్నారు. ఆహారం క్వాలిటీ అత్యంత అధ్వానంగా ఉందని, దాదాపు ప్రతి ఒక్కరూ భోజనాన్ని తిరిగి ఇచ్చేసినట్లు స్పష్టం చేశారు. ఇక TV స్క్రీన్ సైతం పనిచేయలేదని, తన లగేజ్ హ్యాండిల్‌ను విరగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరొక వినియోగదారు తన ఆహారంలో బ్లేడ్ ఉన్నట్లు చెప్పి షాక్ ఇచ్చారు. జూన్ 9న బెంగుళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న వేళ.. ఫ్లైట్‌లో అందించిన ఫిగ్ చాట్ బౌల్‌లో బ్లేడ్ కనుగొన్నట్లు చెప్పారు. రెండు లేదా మూడు సెకన్ల పాటు నమిలిన తర్వాత అది ఆహారంలో ఉన్నట్లు గ్రహించానని వెల్లడించారు. దానిని బయటకు ఉమ్మివేసిన తర్వాత కానీ అదేమిటో తనకు అర్థం కాలేదన్నారు. స్టాఫ్ వచ్చి క్షమాపణలు చెప్పి చిక్‌పీస్ గిన్నె అందించినట్లు తెలిపారు. కొన్నిరోజుల తర్వాత వచ్చే ఏడాదిలో ఎక్కడికైనా బిజినెస్ క్లాస్ ట్రిప్ తీసుకోవచ్చని కంపెనీ నుంచి మెయిల్ వచ్చిందని, అటువంటి లంచాన్ని తాను అంగీకరించనని స్పష్టం చేశారు.
ఈ పోస్టులపై ఎయిర్ ఇండియా స్పందించింది. 'ప్రియమైన సార్, అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి. మా ప్రయాణికులు అలాంటి అనుభవాన్ని ఎదుర్కోవాలని మేము ఎప్పుడూ కోరుకోము. దయచేసి మీ బుకింగ్ వివరాలు, సీట్ నంబర్ మాకు పంపించండి. మేము వెంటనే పరిశీలిస్తాము' అని పోస్ట్ చేసింది. మరో ఫిర్యాదుకు సంబంధించి కూడా 'ఈ తరహా సేవలను మా ప్రయాణీకులకు అందించాలని మేము కోరుకోవడం లేదు. దయచేసి మీ బుకింగ్ వివరాలను మాకు DM చేయండి. వెంటనే సమీక్షించి, పరిష్కరించేలా చూస్తాము' అని రిప్లై ఇచ్చింది. ఇతరులు కూడా తమ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేశారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications