Bengaluru News: బెంగళూరు రైల్వే ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే.. 6 గంటలు ఆలస్యంగా నడిచిన వందే భారత్..!
బెంగళూరు నుంచి కేరళ వెళ్లే వందే భారత్ ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆదివారం ఉదయం కేఎస్ఆర్ బెంగళూరు, కేఆర్ పుర రైల్వే స్టేషన్లకు చేరుకున్న కేరళకు వెళ్లే వందలాది మంది ప్రయాణికులు వారి వందే భారత్ రైలు ఆలస్యంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైలులో సాంకేతిక సమస్య రావడంతో రైలు ఆలస్యమైందని అధికారులు తెలిపారు. ఓనం పండుగకు ముందే కేఎస్ఆర్ బెంగళూరు-ఎర్నాకులం జంక్షన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా బుక్ అయిపోయింది. అధికారులు 'హాట్ యాక్సిల్' ను గుర్తించిన తర్వాత ఉదయం 5:10 గంటలకు బయలుదేరాల్సిన రైలు ప్రయాణాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.
రైలు ఆలస్యం గురించి చాలా మంది ప్రయాణికులకు వారి ప్రయాణానికి కేవలం గంట ముందు మాత్రమే అందింది. అప్పటికే కేఆర్ పుర స్టేషన్‌లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకున్నారు. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో, రైలు ఉదయం 8:45 గంటలకు బయలుదేరుతుందని ప్రయాణికులకు తెలియజేశారు. అయితే సవరించిన సమయాన్ని ఉదయం 11:10 గంటలకు మార్చవలసి వచ్చింది. రైలు చివరకు ఉదయం 11:45 గంటలకు కేఎస్ఆర్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఆలస్యం కారణంగా రైల్వే సిబ్బంది ప్రయాణికులకు ప్లాట్‌ఫారమ్‌పైనే భోజనం అందించారు. కేఆర్ పురం స్టేషన్ చాలా రద్దీగా ఉందని ఓ ప్రయాణికురాలు చెప్పింది.

సరైన వెయిటింగ్ రూమ్‌లు గానీ, మంచి రెస్టారెంట్లు గానీ లేవని. ఆరు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది తమ పిల్లలతో కూడా వేచి ఉన్నారని చెప్పారు. దీనివల్ల తమకు చాలా అసౌకర్యం కలిగిందన్నారు. కాగా బెంగళారు ఎన్నాకులం వంద భారత్ లో ఈ మధ్యే సీటింగ్ కెపాసిటి పెంచారు. ఎనిమిది కోచ్‌ల కాన్ఫిగరేషన్‌ను 16 కోచ్‌ల రేక్ లేఅవుట్‌కు అప్‌గ్రేడ్ చేసి చేశారు.
బోగీలు 8 నుంచి 16కు పెంచడం వల్ల రైలు మొత్తం ప్రయాణీకుల సామర్థ్యం ఒక్కో ట్రిప్‌కు 530 నుంచి 1,128 సీట్లకు పెరిగింది. దీనివల్ల అదనంగా 598 సీట్లు చేరాయి. ఈ కొత్త కూర్పులో 14 ఏసీ చైర్ కార్లు, రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు ఉన్నాయి.
ఈ వందే భారత్ ట్రైన్ కర్ణాటక, తమిళనాడు, కేరళ వాణిజ్య కేంద్రాలను కలుపుతూ, ఈ రైలు తన మార్గంలోని సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిస్సూర్ వంటి కీలక స్టేషన్లలో ఆగుతుంది. సరైన లూబ్రికేషన్ లేకపోవడం, యాంత్రిక లోపం లేదా బ్రేకులు లాగడం వంటి కారణాల వల్ల కోచ్‌లోని యాక్సిల్ అధికంగా వేడెక్కినప్పుడు 'హాట్ యాక్సిల్' ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని సరిచేయకపోతే, బేరింగ్‌లు జామ్ అవ్వడం, రైలు పట్టాలు తప్పడం, బ్రేక్‌డౌన్‌లు, నిర్మాణపరమైన అగ్నిప్రమాదాలు వంటి తీవ్రమైన సంఘటనలకు దారితీయవచ్చని హెచ్చరించారు. అందుకే రిపేర్ చేయడానికి సమయం పట్టిందని వివరించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications