ఆగస్ట్ నెలలో పాసింజర్ వెహికిల్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 39 శాతం పెరిగినట్లు ఆటోమొబైల్ డీలర్స్ బాడీ FADA మంగళవారం తెలిపింది. గత ఏడాది ఆగస్ట్ నెలలో 1,82,651 యూనిట్ల పాసింజర్ వెహికిల్స్ విక్రయించగా ఈ ఆగస్ట్ నెలలో 2,53,363కు పెరిగాయి. టూవీలర్ సేల్స్ ఏడు శాతం పెరిగి 9,15,126 యూనిట్ల నుండి 9,76,051 యూనిట్లకు పెరిగాయి.
కమర్షియల్ వెహికిల్ సేల్స్ 98 శాతం పెరిగి 26,851 యూనిట్ల నుండి 53,150 యూనిట్లకు పెరిగాయి. త్రీవీలర్ సేల్స్ 80 శాతం లాభపడి 16,923 యూనిట్ల నుండి 30,410 యూనిట్లకు పెరిగాయి. మొత్తం సేల్స్ ఏడాది ప్రాతిపదికన ఆగస్ట్ నెలలో 12,09,550 యూనిట్ల నుండి 13,84,711 యూనిట్లకు పెరిగాయి.

ఆగస్ట్ నెలలో ప్యాసింజర్ వెహికిల్ రిటైల్ సేల్స్ 39 శాతం వృద్ధి నమోదయిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(FADA) ప్రకటించింది. ట్రాక్టర్ అమ్మకాల్లో 35.49 శాతం వృద్ధి నమోదయింది. స్థూలంగా అన్ని విభాగాల్లో కలిపి ఆగస్ట్ నెలలో వెహికిల్ సేల్స్ 14 శాతం పెరిగాయి. పాసింజర్ వెహికిల్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన జూలై నెలలోను 45 శాతం పెరిగాయి. 2020 జూలై నెలతో పోలిస్తే సేల్స్ 1,82,779 యూనిట్ల నుండి 2,64,442 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications