పాసింజర్ వెహికిల్ సేల్స్ వరుసగా నాలుగో నెల క్షీణించాయి. అయితే టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్ సేల్స్ మాత్రం 50 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ప్రధానంగా సెమీ కండక్టర్ల కొరత కారణంగా ఆటో కారుమేకర్లు ఉత్పత్తిని తగ్గించాయి. మారుతీ సుజుకీ, హ్యుండాయ్ మోటార్స్ ఇండియా కూడా ఉత్పత్తిని తగ్గించాయి. గత నెలలో ఇండస్ట్రీ 2,55,000 పాసింజర్ వాహనాలను విక్రయించింది. ఏడాది ప్రాతిపదికన అంటే 2020 డిసెంబర్ నెలతో పోలిస్తే 2021 డిసెంబర్ నెలలో 8 శాతం తగ్గి 2,77,000 యూనిట్లకు తగ్గాయి.
పాసింజర్ వెహికిల్ సేల్స్ లోకల్ మార్కెట్లో 3 మిలియన్ల మార్కును దాటడం ఇటీవల మూడోసారి. 2017, 2018 సంవత్సరాల్లో 3 మిలియన్ల పాసింజర్ వెహికిల్ సేల్స్ క్రాస్ అయ్యాయి. అయితే గత మూడేళ్లలో మళ్లీ ఈ మార్కు దాటడం ఇదే (2021లో) మొదటిసారి. డిసెంబర్ 2021లో మారుతీ సుజుకీ అత్యధికంగా 1,23,016 యూనిట్లను విక్రయించింది. ఏడాది ప్రాతిపదికన అంటే 13 శాతం క్షీణించి 1,40,754 యూనిట్లుగా నమోదయింది.

పాసింజర్ వెహికిల్ విభాగంలో మారుతీ సుజుకీ, హ్యుండాయ్ నిరాశపరచగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా రాణించాయి. వాహన ఉత్పత్తిపై సెమీకండక్టర్ల కొరత ప్రభావం కనిపించింది. టాటా మోటార్స్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 2020 డిసెంబర్ నెలలో 25,545 యూనిట్ల నుండి 50 శాతం పెరిగి 2021 డిసెంబర్ నాటికి 35,299కు పెరిగాయి.
నిస్సాన్, స్కోడా వృద్ధి నమోదు చేశాయి. హోండా కార్స్ ఇండియా క్షీణించింది. మారుతీ సుజుకీ మొత్తం సేల్స్ 1,60,226 నుండి 4 శాతం తగ్గి 1,53,149కు చేరుకున్నాయి. ఆల్టో, వ్యాగన్-ఆర్ కూడిన చిన్న కార్ల విభాగం సేల్స్ 35 శాతం తగ్గి, 24,927 నుంచి 16,320కు చేరాయి. స్విఫ్ట్, డిజైర్, బాలెనో వంటి కాంపాక్ట్ కార్ల సేల్స్ 77,641 నుండి 11 శాతం తగ్గి 69,345కు చేరాయి. హ్యుండాయ్ మోటార్ ఇండియా విక్రయాలు కూడా 26.4 శాతం తగ్గి 66,750 నుండి 48,933కు చేరాయి. బైక్ విభాగంలో హీరో మోటో కార్ప్ సేల్స్ 12 శాతం వరకు క్షీణించాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications