ఇక నుండి రెస్టారెంట్‌లో పరోటాలు తినాలనుకుంటే చపాతీల కంటే ఎక్కువ బిల్లు చెల్లించవలసి ఉంటుంది. చాలామంది భారతీయులు చపాతీలు, పరోటాలను ఇష్టంగా తింటారు. రుచి వేరుగా ఉన్నప్పటికీ రెండు ఒకేలా ఉంటాయి. తయారు చేసేందుకు దాదాపు ఒకే సమయం పడుతుంది. అయితే రోటీ కంటే పరోటాలో నూనె వంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ధరలు కూడా రెస్టారెంట్‌లో దాదాపు సమానంగా ఉంటాయి. కానీ ఇక నుండి హోటల్లో లేదా రెస్టారెంట్‌లో పరోటా తినాలనుకుంటే ఎక్కువ బిల్లు చెల్లించాలి.

పరోటాకు 18 శాతం జీఎస్టీ
పరోటాకు, చపాతికి తేడా ఉందని, అందుకే రెస్టారెంట్లలో వడ్డించే రెడీ టూ సర్వ్ పరోటాపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (AAR) పేర్కొంది. చపాతీ లేదా రోటీకి 5 శాతం వర్తిస్తుంది. పరోటా రెడీ టూ ఈట్ విభాగంలోకి వస్తుందని, కాబట్టి వాటికి 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని AAR కర్ణాటక బెంచ్ స్పష్టం చేసింది. రోటీలు మాత్రం రెడీ టూ ఈట్ విభాగంలోకి రావని తెలిపింది.

అందుకే..
పరోటాలను చాప్టర్ 1905 కిందకు తీసుకు వచ్చి 5 శాతం జీఎస్టీని వర్తింప చేయాలని కోరుతూ AAR కర్ణాటక బెంచ్‌ను ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ ఆశ్రయించింది. అయితే 5 శాతం జీఎస్టీ వర్తించాలంటే చాప్టర్ 1905 లేదా 2106లో షరతులను తృప్తి పరచడంతో పాటు సాధారణ చపాతి లేదా రోటీలో ఏదో ఒకటి అయి ఉండాలని AAR తన ఆదేశాల్లో పేర్కొంది. పరోటా చాప్టర్ 2106 కిందకు వచ్చినప్పటికీ అది చపాతీ లేదా రోటీ లాంటిది కాదని, దానికి దీనికి తేడా ఉందని తెలిపింది. రోటీ లేదా చపాతి రెడీ టూ ఈట్ విభాగంలోకి రావని, అందుకే వాటిని 1905లో చేర్చి 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు తెలిపింది.

ఆహార పదార్థాలపై జీఎస్టీ
చాలా ఆహార పదార్థాలను, ముఖ్యంగా ఎసెన్షియల్, ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలకు జీఎస్టీ వర్తించదు. కానీ ప్రెసెస్ చేయబడిన ఫుడ్స్ పైన ఉత్పత్తిని అనుసరించి 5 శాతం, 12 శాతం, 18 శాతం జీఎస్టీ ఉంటుంది. ఉదాహరణకు పాపడ్ సున్నా జీఎస్టీ ఉంటుంది. పిజ్జా బ్రెడ్‌కు 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.


Click it and Unblock the Notifications